పుస్తెలతాడు మాయం! | - | Sakshi
Sakshi News home page

పుస్తెలతాడు మాయం!

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

మహిళా పేషెంట్‌ మెడలోంచి చోరీ

కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు మాయమైంది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... కుందనపల్లి సమీప బద్రిపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో సోమవారం జీజీహెచ్‌చే చేరింది. వైద్యుల సూచన మేరకు తొలుత సీటీ స్కాన్‌ చేయించారు. ఈ సమయంలో పేషెంట్‌ మెడలోని పుస్తెలతాడును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సీటీస్కాన్‌ అనంతరం ఈసీజీ కోసం ఈఎండీ విభాగానికి తరలించారు. బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమె కూతురును బయటకు పంపించారు. ఈ క్రమంలోనే పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఈసీజీ విభాగాన్ని పరిశీలించినట్లు తెలిసింది. పేషెంట్‌ కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. ఈఎండీలో ఇటీవల ఓ పేషెంట్‌ మెడలోని చైన్‌ మాయమైనట్లు సమాచారం. అయితే అది ఒకేగ్రామ్‌ గోల్డ్‌ కావడంతో బాధితులు పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో కథలాపూర్‌ యువకుడు మృతి

కథలాపూర్‌: మండలకేంద్రానికి చెందిన కస్తూరి నరేశ్‌(38) హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపా రు. నరేశ్‌ కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. నరేశ్‌కు వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. అందరితో కలిసిమెలిసి ఉండే నరేశ్‌ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

యువకుడి బలవన్మరణం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌ మండలం చీకొడులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. చీకొడుకు చెందిన బొమ్మెన మల్లేశం, దేవవ్వలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీశైలం(25) ఊర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం శ్రీశైలం పడుకోగా తెల్లవారేసరికి తనగదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మల్లేశం, నాన్నమ్మలకు శ్రీశైలం మృతి చెంది కనిపించడంతో బోరున విలపించారు. తల్లి దేవవ్వ హైదరాబాద్‌లో ఉన్న పెద్ద కుమారుడి వద్దకు వెళ్లింది. శ్రీశైలం మృతికి గల కారణాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తండ్రి మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రూ.1.93 లక్షలకు బెల్ట్‌షాపు వేలం

మల్యాల: మల్యాల మండలం ఒబులాపూర్‌ గ్రా మంలో బెల్ట్‌షాపునకు వేలం నిర్వహించారు. వి విధ కుల పెద్దల సమక్షంలో వేలం నిర్వహించగా ఓ నిర్వాహకుడు రూ.1.93లక్షలకు దక్కించుకున్నట్లు స్థానికుల ద్వారా తెల్సింది. ఈ షాపు నుంచి 24గంటలు మద్యం విక్రయించుకునేలా వేలం పాడినట్లు సమాచారం. ఇంత జరిగినా ఎకై ్సజ్‌ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement