
కలెక్టర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
కరీంనగర్/జమ్మికుంట/హుజూరాబాద్: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావుపై అవిశ్వాస రగడ మలుపు తిరిగింది. ఏకపక్షంగా వ్య వహరిస్తున్నారని కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ డీఆర్‌వోకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో 23 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ప్రత్యేక బస్సులో కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు.
తామంతా చైర్మన్ రాజేశ్వర్‌రావు వైపే ఉంటున్నామని, మున్సిపాలిటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన కాపీని తిరస్కరించాలని విన్నవించారు. పార్టీ మారితే అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కోరారు. మల్లయ్య బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారని, ఆయన వ్యవహార శైలి నేపథ్యంలో కౌన్సిలర్ పదవి నుంచి తొలగించాలని విన్నవించారు. వివరాలు అందజేయాలని, న్యాయ విచారణ జరిపి, నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా, క్యాంపులో ఉన్న కొందరు సభ్యులు చైర్మన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
రెండేళ్ల క్రితం వైస్ చైర్‌పర్సన్..
2020 జనవరిలో జమ్మింకుట మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 30 వార్డులుండగా అత్యధికం బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. చైర్మన్‌గా రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పాలకవర్గం కొలువుదీరింది. రెండేళ్ల క్రితం వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్న ఆధ్వర్యంలో కౌన్సిలర్లు చైర్మన్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటి బీఆర్‌ఎస్ పెద్దలు రంగంలోకి దిగి, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మరి ఈసారి అవిశ్వాస తీర్మా నం ఏమవుతుందో చూడాలి.
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడొద్దు
కాంగ్రెస్ పార్టీ చిల్లర్ల రాజకీయాలకు పాల్పడొద్దని, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లను పోలీసు బందోబస్తుతో హైదరాబాద్‌కు తరలించడం దేనికి నిదర్శనమని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి, నెల రోజులు కాకముందే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం చెల్లదని, మెజారిటీ కౌన్సిలర్లు తమవెంటే ఉన్నారని పేర్కొన్నారు.
జమ్మికుంట తహసీల్దార్ అర్ధరాత్రి లబ్ధిదారులను పిలిచి, కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. చైర్మన్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రో దల్బంతోనే అవిశ్వాస రాజకీయాలు నడుస్తున్నాయ ని, కౌన్సిలర్లు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్‌రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగళి రమేశ్, ఎంపీపీలు దొడ్డె మమత, రేణుక, పావని, రాణి, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.