ముక్కోటి మొక్కులు
ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తున్న మార్కెట్‌రోడ్డు స్వామివారు
మహాశక్తి ఆలయంలో కేంద్రమంత్రి సంజయ్ పూజలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివ, కేశవ నామస్మరణలతో మార్మోగాయి. ఉత్తరద్వారం ద్వారా స్వామివార్లు దర్శనమిచ్చారు. నగరంలోని మార్కెట్‌రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి శేషవాహనం అలంకరణ చేయగా, ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. జిల్లా జడ్జి శివకుమార్, దేవాదాశాఖ సహాయ కమిషనర్ సుప్రియ, కాంగ్రెస్ నగర అర్బన్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్, ఈవో కె.సుధాకర్ పాల్గొన్నారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
– కరీంనగర్‌కల్చరల్
మంకమ్మతోటలో భక్తుల క్యూ
హారతి తీసుకుంటున్న భక్తులు
ముక్కోటి మొక్కులు
ముక్కోటి మొక్కులు
ముక్కోటి మొక్కులు


