బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
బాబోయ్ బెబ్బులి
కరీంనగర్‌రూరల్/చొప్పదండి: జిల్లాలో పెద్దపులి సంచరిస్తోందనే ప్రచారంతో గ్రామీణ ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు కరీంనగర్‌రూరల్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట, చొప్పదండి మండలం వెదురుగట్ట శివారు ప్రాంతాల్లో పులి అడుగులు కన్పించాయనే రైతుల సమాచారంతో అటవీ, పోలీస్‌శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి బాలమణి, రేంజ్ అధికారులు షౌకత్ హుస్సేన్, షౌకత్ అలీ ఆధ్వర్యంలో రైతులు గుర్రం వెంకట్‌రెడ్డి, చొక్కారెడ్డి పొలం ఒడ్డుపై ఉన్న అడుగులను పరిశీలించి, పులి పాదాలుగా నిర్ధారించారు. పొలం సమీపంలోని మొక్కజొన్న చేనులో పులి ఉందనే రైతుల సమాచారంతో డ్రోన్ కెమెరాలతో పరిశీ లించగా.. ఆనవాళ్లు కన్పించలేదు. పులిరాకను పరిశీలించేందుకు అటవీ,పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎఫ్‌వో బాలమణి తెలిపారు. పులి సంచరిస్తున్న దృష్ట్యా రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చొప్పదండి ఎస్సై నరేశ్‌రెడ్డి సూచించారు. కాగా.. ఈ విషయమై కేంద్రమంత్రి సంజయ్ డీఎఫ్‌వోను ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడ కుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


