నూతన వేడుకలకు అంతా సిద్ధం
● బేకరీల్లో కేక్‌లు, రెస్టారెంట్లలో స్పెషల్ ఆఫర్లు ● ఈవెంట్ల నిర్వాహకుల ప్రత్యేక ఏర్పాట్లు ● అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ● సంబరాలు గాడి తప్పకుండా పోలీసుల నిఘా
కరీంనగర్‌క్రైం/కరీంనగర్ కల్చరల్/విద్యానగర్: జిల్లాలో న్యూఇయర్ జోష్ మొదలైంది. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026 ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివరి రోజును ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేయగా.. శివారులోని రిసార్టుల్లో వేడుకల్లో పాల్గొనేవారికి ప్రత్యేక ఆఫర్లు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముమ్మరం చేశారు. బేకరీల్లో వివి ధ డిజైన్లలో కేకులు సిద్ధం అవుతుండగా.. రెస్టారెంట్లు.. ఫుడ్‌కోర్టులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ.. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై నిఘా తీవ్రతరం చేశారు.
సందడే.. సందడి
2025కు బైబై చెప్పి.. 2026కు స్వాగతం పలికేందుకు కరీంనగర్‌వాసులు సిద్ధం అవుతున్నారు. 31 నైట్ సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రైవేటు కార్యక్రమానికి పలువురు యూట్యూబ్‌స్టార్లు, కమెడియన్లు రానున్నట్లు సమాచారం. నగరంలోని ఆయా కాలనీవాసులు బాంక్వేట్‌హాల్స్ సైతం బుక్ చేసుకుంటున్నారు. కాలనీ కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్లలో చిన్నారులు, మహిళలు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు రిస్టార్టులు, ఫామ్‌హౌస్‌లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడి నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బేకరీలు, హోటళ్ల, రెస్టారెంట్లలోనూ ఆఫర్లు ఆహ్వానిస్తున్నాయి. వన్‌ప్లస్ వన్, 30శాతం నుంచి 50శాతం డిస్కౌంట్, కాంబో ఆఫర్లతో ప్రచారం ముమ్మరం చేశారు. సెల్ఫీపాయింట్లు, ఫుడ్‌స్టాళ్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నూతన వేడుకలకు అంతా సిద్ధం
నూతన వేడుకలకు అంతా సిద్ధం
నూతన వేడుకలకు అంతా సిద్ధం


