అలంపూర్: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి నుంచి ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వరకు డీఎస్పీ మొగలయ్యతో కలిసి తనిఖీ చేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిపై అవసరమైన చోట సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డులో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అవసరమైన మార్పులు చేపట్టాలన్నారు. ప్రధాన స్టేజీల వద్ద ఫ్‌లైఓవర్ల జరుగుతున్న నిర్మాణాల చోట్ల సర్వీస్ రోడ్ల పక్కన ప్రమాదాల నివారణకు సైడ్ స్టాపర్స్ రేడియం స్టిక్కర్ అతికించాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ప్రదీప్, శంకర్, ఎస్‌ఐలు స్వాతి, రవి, తరుణ్‌కుమార్, సురేష్, హైవే ప్రాజెక్టు మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


