ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయి 70వ అండర్–19 ఎస్జీఎఫ్ నెట్‌బాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు శివకుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మూడురోజుల పాటు పోటీలు కొనసాగనుండగా.. ఉమ్మడి 10 జిల్లాల నుంచి 240 క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు, మేనేజర్లు, 20 మంది అధికారులు, 20 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి ఒక పురుషుల జట్టు, ఒక మహిళల జట్టు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర పరిశీలకులు మోనాలిస, నిర్వాహకులు డా. రామ్మోహన్‌గౌడ్, ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రాజారాం, పీడీలు నర్సింహారెడ్డి, బాలరాజు, రవికుమార్, అనంతసేన, సాయినాథ్, ఎం.బాలరాజు, స్వప్న, సౌమ్య, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


