ఇన్ని నిబంధనలు లేవు.. | - | Sakshi
Sakshi News home page

ఇన్ని నిబంధనలు లేవు..

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

ఇంతకు ముందు కూడా జీవాలకు బీమా ఇచ్చారు. అప్పుడు జీవాలు చనిపోతే ఇన్ని నిబంధనలు ఉండేవి కావు. చెవికి వేసే పోగు లాంటి ట్యాగ్‌ ఫొటో మాత్రమే పంపించేవాళ్లం. ఇప్పుడు మూడు, నాలుగు ఫొటోలు పంపాలంటా. ఇవన్నీ ఇబ్బంది. నాకు జీవాలు ఉన్న బీమా చేయించలేదు.

– జానకిరాములు, పెంపకందారు,

అమరవాయి, మల్దకల్‌

ఫొటోలు తీయడం ఇబ్బందే..

నాకు 200 జీవాలు ఉన్నాయి. బీమా చేసేందుకు డాక్టర్లు వచ్చారు. చెవికి వేసే ప్లాస్టిక్‌ ట్యాగ్‌ పెద్దగా ఉంది. దీనిని ఒత్తినప్పుడు రంద్రం అయి పుండుగా మారింది. చాలా జీవాలకు ఇలా పుండ్లు అయ్యాయి. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. జీవాలను మేత కోసం ఎక్కడెక్కడో తీసుకెళ్తాం. అప్పుడు వాటికి ఏమైనా జరిగి చనిపోతే ఫొటోలు తీయడం కూడా మాకు ఇబ్బందే.

– మనోజ్‌, పెంపకందారుడు,

గార్లపాడు, ఇటిక్యాల మండలం

ఉన్నతాధికారులకు వివరించాం..

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జిల్లా ను ఎంపిక చేసి ప్రభు త్వం గొర్రెలు, మేకలు, పొట్టేళ్లకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పించాం. అయితే ట్యాగ్‌ల వల్ల జీవాలకు గాయాలు కావడం, కొన్ని నిబంధనల వల్ల పెంపకందారులు ఆసక్తి కనబర్చలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వెంకటనారాయణ,

జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement