న్యూస్‌రీల్
నెట్టెంపాడులోనూ నీటి కొరత
కోయిల్‌సాగర్‌లోనూ అంతంతమాత్రమే
తాగునీటికే ప్రాధాన్యం..
రబీలో క్రాప్ హాలిడే
జోగుళాంబ గద్వాల
నీళ్లు నిల్..
ఉమ్మడి పాలమూరులో యాసంగిలో క్రాప్ హాలిడే
● అడుగంటిన జలాశయాలు..
ఆగిన సాగు
● ఖరీఫ్‌లో 8 లక్షల ఎకరాలకుగాను 6.50 లక్షల ఎకరాల్లోనే సాగు
● జూరాల చరిత్రలో తొలిసారిగా
నవంబర్‌లోనే నీటి ఎద్దడి
● ఐదు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో
రెండో పంటకు నీళ్లివ్వలేని దుస్థితి
● వచ్చే వర్షాకాలం వరకు
తాగునీటి అవసరాలకే
ప్రాజెక్టుల నీరు
● ఆరుతడి పంటలే సాగు
చేయాలంటున్న అధికారులు
హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం
మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో శుక్రవారం ఎస్‌జీఎఫ్ బాల, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభమైంది.
శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2026
–8లో u
చిన్నారుల
కోసం ప్రత్యేక ప్రజావాణి
గద్వాల: బాలల వారోత్సవాల్లో భాగంగా సోమవారం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ శుక్రవారం ఒక ప్రక టనలో తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 18 ఏళ్లలోపు పిల్లలు స్వయంగా కాని, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయంతో ప్రజావాణిలో తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
మానవపాడు: ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించిన పనులన్నీ త్వరగా పూర్తిచేయడంతోపాటు వ్యాక్సిన్ రికార్డుల నిర్వహణ పక్కాగా చూసుకోవాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఎంహెచ్‌ఎన్ సుధీర అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి.. మాట్లాడారు. ఫార్మసీ రికార్డులను సరిగా నిర్వహించాలని, ల్యాబ్‌లో అన్ని రకాల పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ కీర్తి, రాము, రాజేష్, ప్రోగాం ఆఫీసర్ రాధిక, రామాంజనేయులు, యాకుబ్‌బాషా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పల్లీ @ రూ.10,131
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 873 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.10,131, కనిష్టంగా రూ.5,090, సరాసరిగా రూ.8,899 ధర లు లభించాయి. అలాగే 37 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,749, కనిష్టంగా రూ.7,569, సరాసరిగా రూ.7,639 పలికాయి. 734 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.3,423, కనిష్టంగా రూ.2,829, సరాసరిగా రూ.3,369 చొప్పున వచ్చాయి.
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు శుక్రవారం ధా న్యం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 12 వేల బస్తాల
ధాన్యం విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.3,959, కనిష్టంగా రూ.2,479 ధరలు లభించాయి. అదేవిధంగా 1854 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,214, కనిష్టంగా రూ.2,869, వేరుశనగ రూ.8,013 ధరలు పలికాయి.
ప్రియదర్శిని జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం
గద్వాల: ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. ఫలితంగా అడుగంటిన జలాశయాలు! ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కింద ఈసారి ఖరీఫ్ సాగుకే నీటి కష్టాలు ఎదురుకాగా.. రబీ సీజన్‌లో రెండో పంటకు పూర్తిగా నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఖరీఫ్‌లో సుమారు 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఈసారి 6.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాగైన పంటలకూ సెప్టెంబర్, అక్టోబర్ నుంచే నీటి ఎద్దడి మొదలైంది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేసినా పూర్తిస్థాయిలో పంటలను కాపాడలేకపోయారు. ఇప్పుడు రబీ సీజన్‌లోనూ సాగుకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జూరాల చరిత్రలోనే తొలిసారిగా నవంబర్‌లో నీటి నిల్వలు అడుగంటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సంగంబండ రిజర్వాయర్
సంగంబండ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.50 టీఎంసీలే అందుబాటులో ఉంది. దీని కింద 65 వేల ఎకరాల ఆయకట్టుకు గాను ఖరీఫ్‌లో 50 వేల ఎకరాల్లో సాగు చేశారు. భూత్పూర్ జలాశయం సామర్థ్యం 1 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.50 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద 45 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 30 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ రెండు జలాశయాల పరిధిలోనూ ఖరీఫ్ పంటలకు వారబందీ విధానంలోనే నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈసారి అసాధారణ పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాధారణంగా ఖరీఫ్‌లో ఈ ఆయకట్టు పరిధిలో వరి సాగవుతుండగా నవంబర్, డిసెంబర్ మొదటి వారంలో పంట చేతికొచ్చేది. ఈసారి లక్ష ఎకరాలకు పైగా వరి సాగు చేసిన రైతులకు సెప్టెంబర్, అక్టోబర్‌లోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి విడుదల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతోపాటు స్వయంగా కాలువలకు నీటిని విడుదల చేసుకున్న ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేసులు సైతం నమోదయ్యాయి. ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపినా ఆశించిన ఫలితం లేకపోయింది. చివరకు వారబందీ విధానంలో నవంబర్ 6 వరకు నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ చివరి ఆయకట్టు పరిధిలోని సుమారు 5 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్‌లోనే జూరాలలో నీటి నిల్వలు అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాభావ పరిస్థితులతో జూరాల, భీమా, కేఎల్‌ఐ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిధిలోని జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 9 టీఎంసీల నీటి నిల్వలను వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి అవసరాల కోసం వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు పరిస్థితిని వివరిస్తున్నారు. రబీలో వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయకుండా.. బావులు, బోర్లలో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద రెండో పంటకు నీరందించలేని పరిస్థితి ఏర్పడటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 2 లక్షల ఎకరాలు కాగా, అసంపూర్తి పనుల కారణంగా ప్రస్తుతం 1.58 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం 1.32 టీఎంసీలు కాగా, ర్యాలంపాడు సామర్థ్యం 4 టీఎంసీలు. రిపేర్ల కారణంగా ర్యాలంపాడులో 2 టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద సాధారణంగా ఖరీఫ్‌లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రబీలో క్రాప్ హాలిడే అమలు చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌లోనే నీటి కొరత ఏర్పడటంతో వారబందీ విధానంలో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ర్యాలంపాడులో 0.96 టీఎంసీలు, గుడ్డెందొడ్డిలో 0.36 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
కోయిల్‌సాగర్ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.15 టీఎంసీలే అందుబాటులో ఉంది. దీని కింద 50,250 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో కేవలం 12 వేల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో సాగైన పంటలకు సైతం వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు.


