ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్షల సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్షల సేవలు

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

అలంపూర్‌: ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర రక్ష పరీక్షల సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సయ్యద్‌ బాషా తెలిపారు. అలంపూర్‌ చౌరస్తాలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రిలోకి గ్లోబల్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ ఎస్‌ఏఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రక్త పరీక్షల యంత్రాలను అందజేశారు. ఆస్పత్రిలో రక్త పరీక్షలకు కోసం సెల్‌ కౌంటర్‌, బయోకెమికల్‌ అనలైజర్స్‌ను బహూకరించగా.. ఏస్‌ఏఆర్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దీపక్‌ప్రజ్ఞ నూతన యంత్రాలను సూపరింటెండెంట్‌తోపాటు డీసీహెచ్‌ఎస్‌ వరలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీపక్‌ ప్రజ్ఞ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సూచన మేరకు రక్త పరీక్షల యంత్రాలను ఫౌండేషన్‌ ద్వారా అందజేసినట్లు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర రక్త పరీక్షలకు సరైన యంత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో సకాలంలో రక్త పరీక్షల రిపోర్టులు అందించాలనే సంకల్పంతో ఈ యంత్రాలను అందించినట్లు వెల్లడించారు. రక్త పరీక్షల నమూనాల పరీక్షల సేవలు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దొడ్డప్ప, ఉండవెల్లి సర్పంచ్‌ నాగరాజు, జిల్లా ఎస్టీ, ఎస్సీ విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు నర్సింహ, నాయకులు వెంకటేష్‌గౌడ్‌, మద్దిలేటి, గోపాల్‌, రమణ, రాము, నయీం, మెక్తార్‌బాష, శంకర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement