నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు తెర

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

● మూడేళ్ల తర్వాత కొత్తవారికి

ప్రభుత్వం ‘చేయూత’

● తాజాగా 10,170 లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు

● మున్సిపాలిటీలు, మండలాల వారీగా ప్రొసీడింగ్స్‌ పంపిణీకి ఏర్పాట్లు

● ఈ నెల 19న లబ్ధిదారుల

ఖాతాలో సొమ్ము జమకు చర్యలు

● జిల్లావ్యాప్తంగా

12,269 మంది దరఖాస్తు

గద్వాల న్యూటౌన్‌: చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఇస్తామని చెప్పినా మూడేళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారంలోగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందించనున్నారు. 19న లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ కానుంది. జిల్లావ్యాప్తంగా 13 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 12,269 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివిధ స్థాయిల్లో పరిశీలన, విచారణ అనంతరం 10,170 మందికి కొత్తగా మంజూరు లభించగా.. మరో 112 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు.

వేల సంఖ్యలో అర్హులు..

చేయూత పథకం కింద అర్హులైన వారు వేల సంఖ్య లో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నా లుగేళ్ల నుంచి కొత్త వాటిని మంజూరు చేయలేదు. దీంతో వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారు. ఇలా ఇబ్బందులు పడ్డవారికి ఎట్టకేలకు చేయూత అందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒంటరి మహిళలు, వితంతువులు,గీత, నేత కార్మికులు, ఫై లేరియా, డయాలసిస్‌ రోగులు,దివ్యాంగుల నుంచి కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఆగస్టు 10 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత క్షేత్రస్థాయి లో సిబ్బంది, అధికారులు విచారణ చేశారు. అక్టోబ ర్‌ చివరి నాటికి అర్హులను గుర్తించి పోర్టలో వివరా లు నమోదు చేసి, తుది జాబితా విడుదల చేశారు.

వృద్ధులకు మొండిచేయి

కొత్త పింఛన్ల మంజూరు వితంతువులు, దివ్యాంగు లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులకు సంతో షం కలిగిస్తే.. వృద్ధులకు మాత్రం నిరాశే మిగిల్చింది. గతం ప్రభుత్వం పింఛన్‌ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం 57 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. దీంతో చాలామంది అర్హులైన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 57 ఏళ్లు దాటి 60లో పడినా పింఛన్‌ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వృద్ధులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement