అలంపూర్: ఇంటర్‌మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ ఉండవెల్లి మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీని ప్రకటించాలని, 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలన్నారు. లేదంటే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఈహెచ్‌ఎస్‌ను కర్నూలులో ఇంప్లిమెంటేషన్ అయ్యేలా చూడాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడానికి స్వాగతిస్తున్నామన్నారు. కానీ, విలీనం చేసినంత మాత్రాన విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరగదన్నారు. హయ్యర్, సెకండరీ అనే ము క్కలు చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అన ంతరం సమావేశంలో గతేడాదిగా శాఖాపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షులుగా అరుణతార, గరీబ్‌బాష, ప్రధాన కార్యదర్శిగా మునిస్వామి ఎన్నికయ్యారు.
1,152 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 1,152 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.9,680, కనిష్టంగా రూ.5,129, సరాసరిగా రూ.7,190 ధరలు లభించాయి. అలాగే 18 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,779, కనిష్టంగా రూ.7,739, సరాసరిగా రూ.7,759 చొప్పున పలికాయి. 1,268 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.3,472, కనిష్టంగా రూ.2,588, సరాసరిగా రూ.3,321 ధరలు వచ్చాయి.
రూ.4వేల చేరువలో ధాన్యం ధర
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం ధాన్యం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు 14,103 బస్తాల ధాన్యం విక్రయానికి తెచ్చారు. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.3,989, కనిష్టంగా రూ.2,479 ధరలు లభించాయి.


