జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి రైతులకు వారానికి మూడురోజులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి. వానాకాలం పంటల సాగుకు రాబోయే కొద్దిరోజుల పాటు జూరాల ప్రధాన కుడి కాల్వ నుంచి నీరు వదలాలి. ఎగువ నుంచి వరద ఆశించిన మేర వస్తే.. నిరంతరం సరఫరాకు అధికారులు ప్రయత్నించాలి.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే
వారాబందీ విధానంలో నీటి విడుదల
చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేయాలి. ఎల్‌నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.
– మధుసూదన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరిసాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు.
– వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే


