మక్తల్: మక్తల్ పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్య నర్సప్ప ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈయన 2000 సంవత్సరంలో మృతిచెందగా.. ఆయన వారసులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కడు పేదరికంలో ఉన్న ఈ కుటుంబం తమ పూరి గుడిసె ముందే జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సహాయం అందడం లేదని ఆర్య నర్సప్ప ముగ్గురు కుమారులు వాపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నారాయణ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పూరిగుడిసెలోనే కాలం వెళ్లదీస్తూ.. జెండా పండుగను జరుపుకొంటున్నారు. తాము బతికినంత కాలం ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని నారాయణ ‘సాక్షి’కి తెలిపారు.


