అంతరాలే
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
లేదు 153
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు?
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం
● అవినీతి కూడా ప్రధాన సమస్య
● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి
● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు
I
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా నేటికీ పేదలకు, ధనికులకు మధ్య అంతరాలు తొలగిపోలేదు. దీనికి కారణం ప్రభుత్వంలోని పాలకులే. ప్రధానంగా విద్య, వైద్యం దేశంలో చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు, బడాబాబులకు రెడ్ కార్పెట్ వేస్తూ.. మరోవైపు పేదలకు తీరని అన్యాయం చేస్తున్నాయి. – వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి, గద్వాల
గతంతో పోల్చితే.. ప్రస్తుతం పాలకుల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారి తనం కొరవడింది. కేవలం పలుకుబడి ఉన్నవారికే ప్రభుత్వ సంస్థలు, పాలకులు పనిచేస్తున్నారు. అభాగ్యులకు అండగా నిలబడే వారే లేకుండా పోయారు. ఈ పరిస్థితి మారాలంటే పాలకుల ఆలోచన విధానం మారాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారితనం పెరగాలి. అప్పుడే సామాన్య ప్రజలకు నమ్మకం కలుగుతుంది. – షఫిఉల్లా, న్యాయవాది, గద్వాల
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడి చినా సమాజంలో అసమాన తలు పూర్తిగా తగ్గలేదు. కుల ం ఆధారంగా అవకాశాల్లో వి వక్ష కొనసాగితే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ప్రతి ఒ క్కరూ ఆత్మవిమర్శ చేసుకుని అవినీతి ని అంతమొందించేందుకు కృషిచే యాలి. ముఖ్యంగా రాజకీయ నా యకులకు 65 ఏళ్లకే పదవీ విరమ ణ విధానం తీసుకొచ్చి.. యువత రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. – కార్తీక్,
ఎంఎస్‌ఎఫ్ అధ్యక్షుడు
79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత
ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య?
సర్వే సాగిందిలా..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్,
నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఒక్కో జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 250 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రతి జిల్లాలో 25
మంది పురుషులు, 25 మంది మహిళలను
ఎంపిక చేసి మూడు ప్రశ్నలపై
సమాధానాలు తీసుకున్నారు.
స్వేచ్ఛ–సమానత్వం నిజంగానే
అందరికీ చేరుతోందా?
అవును 31
పేదలకు అన్యాయం..
జవాబుదారితనం లేదు..
అసమానతలు లేని సమాజం కావాలి


