విద్యుత్ దీపాలతో ముస్తాబైన కలెక్టరేట్
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
ఉదయం 9.05 గంటలకు ఎస్పీ శ్రీనివాసరావు చేరుకుంటారు.
9.10 గంటలకు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ వస్తారు.
9.15 గంటలకు ముఖ్య అతిథి ఏపీ జితేందర్‌రెడ్డి హాజరవుతారు.
9.20 గంటలకు ముఖ్య అతిథి జాతీయ జెండాను ఎగరవేసిన
తర్వాత.. జాతీయ గీతాలాపన, రాష్ట్ర అధికారిక గీతాలాపన ఉంటుంది.
9.30 గంటలకు పోలీస్ కవాతు నిర్వహిస్తారు.
9.40 గంటలకు ముఖ్య అతిథి జిల్లా ప్రగతి సందేశం వినిపిస్తారు.
10.05 గంటలకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు
10.40 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
10.45 గంటలకు స్టాళ్ల సందర్శన
11.15 గంటలకు ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు
ప్రశంసాపత్రాల అందజేత
11.50 గంటలకు వందన సమర్పణతో వేడుకలు ముగుస్తాయి.
గద్వాల: జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానాన్ని 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ మేరకు కార్యక్రమ వేదిక, బారికేడింగ్ సీటింగ్ అరెంజ్‌మెంట్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రెయినీ డీసీ మనోజ్‌కుమార్‌రెడ్డి, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న
కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు
కార్యక్రమాలు ఇలా..


