ఉండవెల్లి: మండలంలోని బొంకూరు గ్రామంలోని చెరుకుతోటకు పిచికారి చేసిన గడ్డి మందు గాల్లోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న పత్తి పంటలకు వ్యాపించడంతో మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేతలు, జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ఆధ్వర్యంలో పరిశీలించారు. పత్తి పంటలో ఆకులు ఎండిపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్‌రెడ్డి, సుధారాణి, నవత 20 ఎకరాలలో సాగైన పత్తి పంటలను పరిశీలించి.. నమూనాలు సేకరించారు. పూర్తి వివరాలు నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ అనిత తదితరులు పాల్గొన్నారు.
7న జాతీయ
చేనేత దిదోత్సవం
గద్వాల: జాతీయ చేనేత దినోత్సవంను శుక్రవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏడీ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల వినియోగం, చేనేత కళల పరిరక్షణ, చేనేత వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చేనేత రంగం– భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రోబోటిక్స్ శిక్షణ
గద్వాల: తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోహం అకాడమీ రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కలందర్‌బాష తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడం, సాంకేతికతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సోహం అకాడమీ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలను నేర్చుకుని నైపుణ్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో చంద్రమోహన్, ఐక్యూసీ కోఆర్డినేటర్ రాధిక, సమన్వయకర్త సత్యమ్మ సుబ్రమణ్యం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
టెండర్లు పూర్తి
గద్వాల: జిల్లాలోని మైనార్టీ గురుకులాల ఆహార సరఫరా టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సయ్యద్‌పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా కోసం దాఖలైన టెండర్లను మంగళవారం అదనపు కలెక్టర్ మధుమోహన్ సమక్షంలో ఓపెన్ చేసినట్లు వివరించారు.
8న సప్తాహా భజనలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 15 వరకు సప్తాహ భజనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సప్తాహ భజన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. వారం రోజుల పాటు కొనసాగే సప్తాహ భజనలకు భక్తభజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
15, 16 తేదీల్లో ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15, 16 తేదీల్లో ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు మహబూనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్స్‌లో మాత్రమే పోటీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 12వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాల కోసం 98480 85211 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


