అయిజ శివారులోని పెద్దవాగులో నిర్మించిన చెక్ డ్యాం సైడ్‌వాల్స్ భారీ వ ర్షాలకు కొట్టుకుపోయా యి. అప్పటి నుంచి వాగు లో చుక్కనీరు నిలవడం లేదు. కనీసం పశుపక్షాదులు దాహం తీర్చుకోవడానికి నీరు లేకుండా పోయింది. వాటికి మరమ్మతు చేస్తే వాగులో నీరు నిలుస్తుంది. ఫలితంగా భూగర్భజలాలు పెరిగి రైతులకు ఉపయోగపడతాయి.
– వెంకటేశ్వర్‌రెడ్డి, ఎక్లాస్‌పురం
అయిజ శివారులో నిర్మించిన చెక్‌డ్యాం తెగిపోయినప్పటి నుంచి వాగులో చుక్క నీరు కూడా నిల్వ ఉండటం లేదు. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి బోరుబావులలో నీరు తగ్గిపోయింది. ఓపెన్ వెల్స్ కూడా ఎండిపోయాయి. చెక్‌డ్యాంలను పునర్ నిర్మిస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. తద్వారా రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
– నాగరాజు, అయిజ
జిల్లాలో శిథిలమైన చెక్ డ్యాంలను సంబంధిత ఏఈలతో పరిశీలన చేయిస్తాం. శిథిలమైన చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసేందుకు కావాల్సిన నిధులు అంచనా వేసి.. మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతు పనులు చేపడుతాం.
– శ్రీనివాసులు, ఆర్డీఎస్ ఈఈ
●


