అలంపూర్: మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్ర ముప్పుని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సునంద అన్నారు. అలంపూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యత, నకిలీ ఉద్యోగాలు, వివాహాలు, విద్య పేరుతో మహిళలు, బాలికలు, చిన్నారులను అక్రమ రవాణాకు గురిచేస్తున్నారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మరాదని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖ లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం పోక్సో, బాల్యవివాహాల నిషేధ చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా అందిస్తున్న రక్షణ, సంరక్షణ, పునరావాస సేవలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహ, ఎస్‌ఐ రామకృష్ణ, ఎకై ్సజ్ ఎస్‌ఐ మమత, డీహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ సరోజ, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అరుణ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ శివలీల, హెచ్‌ఎం స్వప్న తదితరులు పాల్గొన్నారు.


