భారత మ్యాప్ వివాదం.. ట్రంప్‌ సంచలన నిర్ణయం | Trump admin drops Indo from US Pacific Command name | Sakshi
Sakshi News home page

భారత మ్యాప్ వివాదం.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

Jun 17 2026 9:37 PM | Updated on Jun 17 2026 9:40 PM

Trump admin drops Indo from US Pacific Command name

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్‌ (USINDOPACOM)‌ను మళ్లీ పాత పేరైన యూఎస్ పసిఫిక్ కమాండ్‌ (USPACOM)గా మార్చినట్లు ప్రకటించారు. ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఈ మార్పు చేశారు.

1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌గా ఏర్పాటు చేశారు. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు, అప్పటి రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌లు యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ను కాస్తా యూఎస్‌ ఇండియా పసిపిక్‌ కమాండ్‌గా మార్చారు.

ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరు అయిన యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌గా మార్పు చేశారు. సాంకేతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే పేరు మారుస్తూ అమెరికా రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ మ్యాప్‌ను ఏర్పాటు చేసింది. ఆమ్యాప్‌పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ మ్యాప్‌లో అమెరికా పీవోకేను పాక్‌ భూభాగంలో చూపించింది. దీంతో తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయులు ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ సంబంధాలపై దౌత్య పరమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement