ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

Small Plane Emergency Landing At Texas McKinney Airport Video Viral - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్‌ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది.

దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్‌, ప్రయాణికుడు, కారు డ్రైవర్‌ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top