ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే.. | Bangladeshs Muhammad yunus Mutual Respect Letter to PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే..

Jun 9 2025 7:29 AM | Updated on Jun 9 2025 7:41 AM

Bangladeshs Muhammad yunus Mutual Respect Letter to PM Modi

ఢాకా: భారత ‍ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ లేఖను పోస్ట్‌ చేశారు.

ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్‌ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు.
 

దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌కు రాసిన లేఖలో భారతదేశపు  ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: రాహుల్‌ ‘ఫిక్సింగ్‌’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్‌ కౌంటర్‌ ఆర్టికల్‌

Advertisement
 
Advertisement
Advertisement