breaking news
Muhammad Yunus
-
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్‌ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్‌కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్‌కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్‌ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్‌ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్‌కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్‌కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్‌తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్‌ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్‌ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్‌ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే..
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ లేఖను పోస్ట్ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్ -
సత్వరం ఎన్నికలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌లోగా ఎన్నికల జరపాలనే డిమాండ్‌తో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశ నలుమూలల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు. యూనస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహా్మన్ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత సంస్కరణల అమలును వీలైనంతగా పూర్తి చేసి డిసెంబర్, జూన్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని జపాన్ పర్యటనలో ఉన్న యూనస్ పురుద్ఘాటించారు. -
బంగ్లాదేశ్‌లో ముసలం!
జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది. దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్‌లో నిరుడు ఆగస్టు తిరుగుబాటు తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగావున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకపక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వోద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికేవిధంగా సర్వీసు నిబంధనలు మార్చటం, మరోపక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలివ్వటంలో విఫలం కావటం వగైరాలు అసంతృప్తికి దారితీసి నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది. ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగి లోపాయకారీగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు యూనస్ పావులు కదిపారు. అంతేకాదు... దాని ఆదేశాలతో చిట్ట గాంగ్– రఖినే కారిడార్‌ను ‘మానవతా సాయం’ అందించటానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైనా దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా పది నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయి స్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరంలేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీచేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడిరోడ్డుపై దండించటం, జైళ్లపాలు చేయటం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలే. వీటని సరిదిద్దటానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్‌గా వున్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి, దాన్ని నెత్తినపెట్టుకోవటం మొదలుపెట్టారు. చైనాకు పోయి దాంతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నించారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మాని భారత్‌ను చీకాకు పెట్టడమే లక్ష్యంగా యూనస్ వ్యవహారశైలివుంది.ఎల్లకాలమూ ఇలాగే సాగిపోతుందనుకుంటే చెల్లదు. పాత ప్రభుత్వం పతనమై పది నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈమధ్య లీకులిస్తుండగా,బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్–ఉజ్–జమాన్ ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకొస్తే తాము తిరిగి బ్యారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లా డుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్‌కు మింగుడు పడలేదు. అలాగని ప్రభు త్వాన్ని నడపటం ఆయనకు చేతకావటం లేదు. ప్రభుత్వంలోని మత ఛాందసవర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ఠ పోగొట్టుకున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే.బంగ్లా అధీనంలోవున్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. పదివేలమంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలుగంటున్నది. హిందూ మహా సముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా, బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు... చైనా కన్ను కూడా పడింది. మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్‌కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ల మేర ప్రాంతం ఆ దేశానిదేనని తీర్పునిచ్చినా అడపా దడపా మయన్మార్‌తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసిలే బంగ్లా పౌరులను అపహరించటం, కాల్పులు జరపటం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకూ లేదా చైనాకూ అప్పగిస్తే మన దేశ భద్రతకు ముప్పు కలుగుతుంది. కానీ యూనస్ భారత్‌పై వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను కూడా బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్–రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది. మయన్మార్‌లో సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖినే ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలుపంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ ఆనుపానులన్నీ అమెరికా తెలుసుకుంటుందన్నది బంగ్లా సైన్యం బెంగ.తన నిర్ణయాలను హసీనాయే కాదు... బీఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించటంతో యూనస్‌కు ఎటూ పాలుపోలేదు. అందుకే రాజీనామా బెదిరింపులకు దిగారు. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవటంతో వెనక్కి తగ్గారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించటం చేతకాని తన వ్యవహారశైలితో బంగ్లాదేశ్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో యూనస్ ఆలోచించుకోవాలి. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టుపట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించటమే గౌరవప్రదమని గ్రహించాలి. -
యూనస్ బంగ్లాదేశ్‌ను అమ్మేస్తున్నారు
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మారి్టన్స్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించడానికి నిరాకరించినందుకు తన తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్‌ను హత్య చేశారని గుర్తు చేశారు. ‘‘అమెరికా సెయింట్ మారి్టన్స్ ద్వీపం కావాలని అడిగినప్పుడు నా తండ్రి అంగీకరించలేదు. అందుకు ఆయన తన ప్రాణాలను అరి్పంచాల్సి వచి్చంది. నేనూ దాన్ని కొనసాగిస్తున్నా. అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలనే ఆలోచన నాకూ ఎప్పుడూ రాలేదు’’అని హసీనా పేర్కొన్నారు. డిసెంబర్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునివ్వడంతో.. యూనస్ రాజీనామా చేస్తారనే వార్తలొచి్చన విషయం తెలిసిందే. అయితే.. అందుకు వ్యతిరేకంగా, యూనస్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో... హసీనా ఫేస్బుక్ వేదికగా తీవ్రంగా స్పందించారు. యూనస్ ఉగ్రవాద గ్రూపుల మద్దతుతో పాలన సాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘ఒకే ఒక ఉగ్రవాద దాడి తర్వాత మేం కఠినమైన చర్యలు తీసుకున్నాం. చాలా మందిని అరెస్టు చేశాం. కానీ ఇప్పుడు జైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఉగ్రవాదులందరినీ విడుదల చేశారు. అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాదుల సాయంతో యూనస్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నది ఉగ్రవాదుల పాలన’అని ఆమె అన్నారు. అవామీ లీగ్ నిషేధాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. -
ఆర్మీ వర్సెస్ యూనుస్
ఢాకా: కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్‌లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్, బీఎన్పీ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్ వర్గం మండిపడుతోంది. బ్లాక్‌మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కారును కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనుస్ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనుస్ ఆదివారం పలు పారీ్టలతో భేటీ కానున్నారు. 2026 జూన్‌కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ సర్కారు చెబుతుండగా వచ్చే డిసెంబర్‌లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనుస్ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం తెలిసిందే. -
‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు. -
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
-
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా?
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్‌ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్‌కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్‌ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్’మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్‌లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్‌ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్‌ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. -
అది బ్లడీ కారిడార్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్‌లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెల్సుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’అని పరిశీలకులు అంటున్నారు. వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్‌ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్‌ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.ఏమిటీ కారిడార్..? బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్ ప్రాంతం నుంచి మయన్మార్‌లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న రఖైన్ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన మార్గమే రఖైన్ కారిడార్. ఈ నడవా ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి నుంచి అందిన వినతిపై యూనస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సైన్ ఇటీవల చేసిన ప్రకటనే ఈ అసంతృప్తి జ్వాలకు ఆజ్యం పోసింది. యూనస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), కొన్ని వామపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవ్యతిరేకమంటూ మండిపడ్డాయి. ప్రజల ప్రయోజనాలకు గాలికొదిలేసి విదేశీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఎలాంటి నిర్ణయమైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్లో చర్చించి తీసుకోవాలని పేర్కొంది. ఏదేమైనా, తాత్కాలిక ప్రభుత్వం కారిడార్ ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. చైనాకు చెక్ పెట్టే ఎత్తుగడతోనే అమెరికా ప్రభుత్వం చేసిన ఒత్తిడులకు యూనస్ లొంగిపోయారని పరిశీలకులు అంటున్నారు. మానవీయ సాయం పేరుతో బంగ్లాదేశ్‌లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, సైనిక, నిఘా పరమైన అవసరాలకు దీనిని వాడుకునే అవకాశముందని ఢాకా ట్రిబ్యూన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారిడార్ ఏర్పాటైతే బంగ్లాదేశ్‌తోపాటు మయన్మార్ సార్వభౌమత్వమూ ప్రమాదంలో పడుతుందని తన కథనంలో పేర్కొంది. తాజా నిర్ణయమేమంటే.. ఆర్మీ చీఫ్ హెచ్చరికలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో యూనస్ సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించే ఖలీలుర్ రహా్మన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. రఖైన్ కారిడార్ గురించి తమ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని, ఇకముందు కూడా చర్చించదని స్పష్టం చేశారు. ‘దేశ సరిహద్దులకు సమీపంలోని రఖైన్ ప్రాంత వాసులకు మానవతా సాయం అందించే విషయంలో వీలుంటే సాయం చేయాలని మాత్రమే ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకుంటామని మాత్రం చెప్పాం’అంటూ మాటమార్చారు. అంతకుముందు, ఏప్రిల్‌లో ఆయన..‘రఖైన్ కారిడార్ ఏర్పాటుపై ఐరాస ప్రతిపాదనకు ప్రభుత్వం షరతులతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఆ షరతులేమిటో ఆయన వివరించలేదు. -
బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025 -
‘పాక్‌పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’
ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్ విషయంలో పాకిస్తాన్ మరో స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది. పాక్ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. -
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్. -
బంగ్లా తీరు మారాల్సిందే!
ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్‌తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్‌కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.యూనస్ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్‌కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్‌కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్‌తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.బంగ్లాదేశ్‌కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
మహమ్మద్ యూనస్ తో ప్రధాని మోదీ భేటీ
-
ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు.Profsssor Muhammad Yunus is presenting a photo to Prime Minister Narendra Modi during their bilateral meeting in Bangkok on Friday. The photo is about Prime Minister Narendra Modi presenting a gold medal to Professor Yunus at the 102nd Indian Science Congress on January 3, 2015 pic.twitter.com/lsikvMOWT4— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) April 4, 2025ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్ యూనస్ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు... గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బిమ్స్టెక్లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దేశవ్యాప్త ఆందోళనలతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్ నొక్కి చెప్పింది. మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. -
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది. -
బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. -
బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది. -
Bangladesh: బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్మీ ఇటువంటి ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తిరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే ఇటువంటి ఆదేశాలు జారీ అయ్యాయని కూడా చెబుతున్నారు.నార్త్-ఈస్ట్ న్యూస్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ సైన్యం ఇప్పటికే ఢాకా(Dhaka) చేరుకుంది. భారీ సంఖ్యలో సాయుధ వాహనాలు, 100 మంది సైనికులను తొలుత ఢాకాలో మోహరించినట్లు సమాచారం. 9వ డివిజన్ సైనికులు కూడా ఢాకాకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సైన్యం ఇటువంటి చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామీణాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ షాజిబ్ భూయాన్‌కు చెందిన పాత వీడియో ఒకటి బయటపడింది. అందులో అతను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సమక్షంలో బంగ్లాదేశ్ పగ్గాలను ముహమ్మద్ యూనస్(Muhammad Yunus)కు అప్పగించడానికి అయిష్టంగానే అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా విద్యార్థి నేత హస్నత్ అబ్దుల్లా మార్చి 11న జనరల్ జమాన్‌తో రహస్య భేటీ తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆర్మీ చీఫ్ అనడం హస్నత్ అబ్దుల్లాకు నచ్చలేదని అంటున్నారు.బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు, ఆర్మీ చీఫ్‌కు మధ్య సయోధ్య లేనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నియంత్రించాలని ఆర్మీ చీఫ్ యూనస్ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ మరోసారి షేక్ హసీనా అవామీ లీగ్‌కు మార్గం సుగమం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రాబోయే ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు ఆర్మీ చీఫ్ సన్నాహాలను ప్రారంభించారని సమాచారం. ఇది కూడా చదవండి: Janta Curfew: జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు.. 68 రోజుల లాక్డౌన్ మొదలైందిలా.. -
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్స్ హంట్.. 1300 మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం. -
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్ యూనిస్ హెచ్చరికలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. -
షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. మరో షాకిచ్చిన బంగ్లా సర్కార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్ అధికారులే కారణమని బాంబు పేల్చింది.ఇక, ఈ అంశాలపై కమిషన్ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్ మాట్లాడుతూ.. కమిషన్ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్ ఇంటరాగేషన్ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది. -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
హసీనా మౌనంగా ఉంటే మంచిది
ఢాకా: బంగ్లాదేశ్‌ను వీడిన మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉన్నంతకాలం మౌనంగా ఉంటే మంచిదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ హెచ్చరించారు. హసీనా బంగ్లాదేశ్‌ను వీడాక చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారికి న్యాయం జరగాలని ఆగస్ట్ 13వ తేదీన హసీనా డిమాండ్ చేయడంపై యూనుస్ ఘాటుగా స్పందించారు. గురువారం ఢాకాలోని తన అధికార నివాసంలో పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడా రు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..అప్పగింత కోరేదాకా మౌనంగా ఉండాల్సిందే‘‘హసీనాను అప్పగించాలని మేం భారత్‌ను మేం కోరేదాకా ఆమె అక్కడ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. మౌనమే మేలు. ఇక భారత్ సైతం ఒక విషయం గుర్తుంచుకోవాలి. హసీనా లేకపోయి ఉంటే మా దేశం అఫ్గానిస్తాన్‌లా తయారవుతుందన్న అభిప్రాయాలు మార్చుకోవాలి. హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ తప్ప బంగ్లాదేశ్‌లోని ప్రతి రాజకీయ పార్టీ ఇస్లామిక్ పార్టీ అనే భావననూ భారత్ విడనాడాలి. భారత్‌లో ఉంటూ ఆమె చేస్తున్న బంగ్లా వ్యతి రేక వ్యాఖ్యలపై ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు. ఆమెను వెనక్కి తీసుకురా వాలని యోచిస్తున్నాం. భారత్‌లో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి’’ అని అన్నారు.మేం కూడా ఆమెను మర్చిపోతాం‘‘ఆమె ఇండియాలో మౌనంగా కూ ర్చుంటేనే మేం కూడా ఆమెను మర్చి పోతాం. బంగ్లాదేశ్ ప్రజలూ ఆమెను మర్చిపోతారు. ఆమె తన లోకంలో తాను ఉంటే అందరికీ మంచిది. అలా కాకుండా భారత్‌తో కూర్చుని మాకు ఎలా పరిపాలించాలో ఉచిత సలహాలిస్తే ఎవ్వరికీ నచ్చదు. ఈ ధోరణి మాకేకాదు భారత్‌కు కూడా మంచిది కాదు. ఇరు దేశాల సంబంధాలపైనా ప్రతి కూల ప్రభావం చూపుతుంది. ఆమె సాధారణ పర్యటనకు ఇండియా వెళ్లలేదు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమా నికి జడిసి హసీనా దేశం నుంచి పారిపో యారు. దేశంలో దురా గతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు మా సర్కార్ కట్టుబ డి ఉంది. ఆమె చెబుతు న్నట్లు ప్రజలకు న్యాయం జరగా లంటే వాస్తవానికి ఆమెనే స్వదేశా నికి తీసుకురావాలి. అలా జరగకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలపై అందరి సమక్షంలో విచారణ జరగాల్సిందే’’ అని అన్నారు.భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఇస్లామిక్‌గా మారిపోయిందని, దేశాన్ని అఫ్గానిస్తాన్‌లా మార్చేస్తారని భారత్ భావిస్తోంది. కానీ మేం పొరుగుదేశం ఇండియాతో మైత్రి బంధాన్నే కోరుకుంటున్నాం. హసీనా నాయకత్వంలో మాత్రమే బంగ్లాదేశ్‌లో సుస్థిరత సాధ్యమని భారత్ భావించడం మానుకోవాలి. హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయనేది అవాస్తవం. భారత్‌తో బలహీనంగా ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయమొచ్చింది. రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందం వంటి వాటిని పట్టాలెక్కించాలి. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరుపుతా. తదుపరి ఎన్నికల్లో బీఎన్పీ గెలిచి అధికారంలోకి వస్తే దేశంలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తా’’ అని అన్నారు. -
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర నిరాశ..
-
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్లు.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
తీవ్ర నిరసనలు, అట్టుడికిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నపళంగా దేశం వీడాల్సి వచ్చింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాలో ప్రస్తుతం దేశ పాలన సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. నిరసన కారులను శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సలహాలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా తన సమ్మతిని తెలిపారు.తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హసీనా రాజకీయ విరోధి, మాజీ ప్రధాని ఖలీదా జియా. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం. ఖలీదా జియా.. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు రాష్ట్రపతి ఆదేశించారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. అలాగే దేశ తొలి మహిళా ప్రధాని. 1991 నుంచి 1996, 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. ఖలీదా 1996లో రెండవసారి పీఎంగా గెలిచినప్పటికీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఆమె రెండవ పదవీకాలం 12 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికలు నిర్వహించగా.. హసీనా ప్రధానిగా గెలుపొందారు.2007లో ఖలీదా అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. 2018లో దోషిగా నిర్ధారించడంతో జైలు శిక్ష పడింది. అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ కాలం ఆమె ఆసుపత్రిలోనే గడిపారు. మరి ఈ సమయంలో విడుదలవుతున్న ఖలీదా ప్రధానమంత్రి పదవిని చేపడతారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. మహమ్మద్ యూనస్.. అతను 1983లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో రుణాలను (రూ 2,000 వరకు) అందిస్తుంది. ఇది లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతోంది. అందుకే యూనస్‌కు ి 'పేదలకు బ్యాంకర్' అనే మారుపేరు వచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలలో కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థ అయిన గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే యూనస్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. జూన్‌లో తన టెలికాం కంపెనీ అయినా గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి 252.2 మిలియన్ టాకా (రూ. 219.4 కోట్లు) నిధుల దుర్వినియోగం చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. కానీ తనపై అభియోగాలు రాజకీయ ప్రోద్బలంతో మోపారని ఆరోపించారు.జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు షేక్ హసీనా ప్రత్యర్థులు పెనుగులాడుతుండగా.. విద్యార్థులు మాత్రం యూనస్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు విద్యార్ధులు అంగీకరించడం లేదు.నహీద్ ఇస్లాం..26 ఏళ్ల నహీద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు. ఈ కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు. చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతకు దారి తీసిన నేత ఇస్లాం.జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్, హా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకునే కొందరు అతన్ని అపహరించారు. కానీ నహిద్‌ను తాము ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
డిపాజిట్ల స్వీకరణకు ఎంఎఫ్‌ఐలను అనుమతించాలి
కోల్‌కతా: భారత్‌లో సూక్ష్మ రుణ సంస్థలను (ఎంఎఫ్ఐలు) ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు అనుమతించాలని నోబెల్ పురస్కార గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనస్ అన్నారు. ప్యాన్‌ఐఐటీ గ్లోబల్ ఈ కాంక్లేవ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎంఎఫ్ఐలు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకులను అనుమతించిందంటూ, అవి డిపాజిట్లను స్వీకరించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు రుణం అన్నది ఆరి్థకపరమైన ఆక్సిజన్. బ్యాంకులకు ప్రత్యా మ్నాయ బ్యాంకింగ్ చానల్ (నిధుల కోసం) ఏర్పా టు చేయకుంటే, పేదలకు రుణాలు ఇచ్చేందుకు అవి ఆసక్తి చూపవు’’ అని యూనస్ పేర్కొన్నారు. -
విభిన్న విధానాల వల్లే విజయం
► బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్ విజయంపై నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ ►పేదలకు రుణాలివ్వాలని అందర్నీ కోరి భంగపడ్డా ►అందుకే పేదలే యజమానులుగా గ్రామీణ్ బ్యాంక్ పెట్టాను తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థల నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేయడమే బంగ్లాదేశ్‌లో గ్రామీణ్ బ్యాంక్ విజయానికి ప్రధాన కారణమని నోబెల్ అవార్డు గ్రహీత మమహ్మద్ యూనస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ.. గ్రామీణ్ బ్యాంక్ మొదలుకాక ముందు పేదలకు రుణాలివ్వాల్సిందిగా ప్రతి బ్యాంక్‌ను కోరి భంగపడ్డానని చెప్పారు. దీంతో 1983లో పేదల కోసం.. వారే యజమానులుగా బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ్ బ్యాంక్ బంగ్లాదేశ్‌లోని ప్రతి గ్రామం, పట్టణంలో శాఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు. 200 కోట్ల డాలర్లకుపైగా నిధులు రుణాలుగా ఇస్తే పేద మహిళల నుంచి అంతకుమించిన డిపాజిట్లు చిన్నచిన్న మొత్తాల రూపంలో జమ అయ్యాయని ఆయన వివరించారు. గ్రామీణ్ బ్యాంక్ ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే పేదలకు రుణాలిస్తున్నామని, 40 ఏళ్లుగా రుణ వసూళ్లు దాదాపు వంద శాతం ఉండటం గమనార్హమని యూనస్ అన్నారు. ఇంతటితో ఆగకుండా పిల్లలను పాఠశాలకు పంపించేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించామని, తద్వారా వారు ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులుగా మారారని వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లో.. ► కొన్నేళ్ల క్రితం అనేక మంది యువతీ యువకులు నా వద్దకు వచ్చి పెద్ద చదువులు చదివినా తమకు ఉద్యోగాలు రావడం లేదని ఫిర్యాదు చేసేవారు. గ్రామీణ్ బ్యాంక్ యజమానులైన మీ తల్లుల నుంచి పాఠాలు నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని వారికి సూచించాను. ఈ రకంగా పుట్టుకొచ్చిందే సోషల్ బిజినెస్. ఈ విధంగా గ్రామీణ్ బ్యాంక్ ఓ వెంచర్ క్యాపటలిస్ట్గానూ మారింది. ఆసక్తికరమైన ఆలోచనలు, వ్యాపార నమూనాతో ముందుకొచ్చే యువకులకు ఎలాంటి హామీలు లేకుండా నిధులు అందజేశాం. వారి వ్యాపారాలు విజయవంతమయ్యేందుకు దగ్గరుండి మా వంతు సహకారం అందించాం. వారు వ్యాపారంలో నిలదొక్కుకున్న తరువాత మా పెట్టుబడి మాకు తిరిగివచ్చాయి. దాతృత్వం ద్వారా ఇది సాధ్యం కాదు. ► సోషల్ బిజినెస్‌కు ఇంకో ఉదాహరణ గ్రామీణ్ బ్యాంక్ అంతర్జాతీయ డెయిరీ కంపెనీ డానోన్ తో కలిసి స్థాపించిన సంస్థ. బంగ్లాదేశ్ పిల్లల్లోని పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఈ సంస్థ ప్రత్యేకమైన పెరుగును తయారు చేస్తోంది. పోషకాలన్నీ ఉండే ఈ పెరుగు రకరకాల రుచుల్లో లభిస్తోంది. డానోన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇది తక్కువ ధరకే లభిస్తుండటంతో అటు పోషికాహార లోపమనే సామాజిక సమస్యకూ పరిష్కారాన్ని చూపగలిగాం ► 2050 నాటికల్లా 3 అంశాలను జీరోకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. పేదరికం, నిరుద్యోగం, కర్బన ఉద్గారాల కట్టడి.. ఈ మూడు అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కాదేదీ వ్యాపారానికి అనర్హం ఫ్రాన్స్ లో మెకెయిన్ అని ఓ కంపెనీ ఉంది. బంగాళాదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం దీని వ్యాపారం. ఈ సంస్థ కూడా ఇటీవల సోషల్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.ఫ్రాన్స్ లో పండించే ఆకారం బాగా లేదని పెద్ద కంపెనీలు పక్కన పడేసే ఆలుగడ్డలను సేకరించి వాటితో సూప్‌లు చేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి బంగాళాదుంపలతో పాటు అన్ని రకాల కాయగూరలతోనూ ఇదే తరహా వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రామాయంపేట, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానిక ఏఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూనస్(43) సోమవారం తన కూతురిని అత్తగారింట్లో దింపేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వెళ్లాడు. తిరిగి సరూర్‌నగర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట బైపాస్‌లో బస్సు దిగి, పట్టణ శివారులోని దామరచెర్వు 44వ జాతీయ రహదారిపై నడుచుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూనస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎస్ఐలు మురళి, బాలక్రిష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు.