సత్వరం ఎన్నికలు | BNP Demands Bangladesh Elections Before December 2025 | Sakshi
Sakshi News home page

సత్వరం ఎన్నికలు

May 29 2025 2:37 AM | Updated on May 29 2025 2:37 AM

BNP Demands Bangladesh Elections Before December 2025

బీఎన్‌పీ నిరసనల హోరు 

అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ 

ఢాకా: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిసెంబర్లోగా ఎన్నికల జరపాలనే డిమాండ్‌తో బంగ్లా నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశ నలుమూలల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు.

 యూనస్‌ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్‌ తారిఖ్‌ రెహా్మన్‌ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్‌ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత సంస్కరణల అమలును వీలైనంతగా పూర్తి చేసి డిసెంబర్, జూన్‌ మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని జపాన్‌ పర్యటనలో ఉన్న యూనస్‌ పురుద్ఘాటించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement