breaking news
Bangladesh Nationalist Party
-
బంగ్లా ప్రధానిగా రేపు రహ్మాన్ ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిఖ్ రహ్మాన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రభుత్వం మంగళవారం కొలువుతీరనుంది. రహ్మాన్ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అధ్యక్షుడు మొహమ్మెద్ షాహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఆమెతో పాటు స్పీకర్ కూడా దేశం వీడి అజ్ఞాతంలోకి వెళ్లగా డిప్యూటీ స్పీకర్ జైళ్లో ఉన్నారు. దాంతో రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం నూతన పార్లమెంట్ సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. రహ్మాన్ తండ్రి జియావుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా, తల్లి బేగం ఖలీదా ప్రధానిగా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి అత్యున్నత పదవులను అధిరోహించిన మూడో వ్యక్తిగా రహ్మాన్ నిలవనున్నారు. తాజా ఎన్నికల్లో 297 స్థానాలకుగాను బీఎన్పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది. జూలై ఉద్యమానికి నేతృత్వం వహించిన విద్యార్థి సంఘాలు ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజెన్ పార్టీ కొత్తగా షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు విమర్శించడమే లక్ష్యంగా ఈ షాడో కేబినెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. భారత్ తరఫున ఓం బిర్లా ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఢాకాలో జరిగే కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ఆహా్వనించగా ఆయన తరఫున భారత్ నుంచి బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తా
ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్‌ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్‌ను నిర్మిస్తాం’’అని అన్నారు.4 రోజుల్లో ప్రమాణస్వీకారంప్రధానిగా తారిఖ్‌తో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్పీ నేత మొహమ్మద్ షాహబుద్దీన్ చెప్పారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్(బంగభవన్)లో తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుర్ రషీద్ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్పీ సీనియర్ నేత ఒకరు అన్నారు. భారత్‌తో బంధంపై.. తారిఖ్ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్‌తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం. వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం!భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్ హసీనా కాలంలో భారత్–బంగ్లాదేశ్ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది. -
‘డార్క్ ప్రిన్స్’ నుంచి... ప్రధాని పీఠం దాకా!
తారిఖ్ రహ్మాన్. 19 ఏళ్ల ప్రవాసం వీడి తిరిగొచ్చిన నెలన్నర వ్యవధిలోనే బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ది నిజంగా ఆసక్తికర ప్రస్థానమే. ఆయన తండ్రి దివంగత ముజిబుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు. ఇక తల్లి బేగం ఖలీదా జియా ప్రధానిగా కొనసాగారు. 2001 నుంచి 2006 మధ్య ఆమె హయాంలో రహ్మాన్ రెండో అధికార కేంద్రంగా మారారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. పాలనతో సహా అన్ని వ్యవహారాలనూ తన కనుసన్నల్లో శాసించారంటారు. దాంతో విపక్షాలు, సొంత పార్టీలోని అసమ్మతివాదులే గాక అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించాయి. అంతేగాక ఆ సమయంలో ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన అవామీ లీగ్ సారథి షేక్ హసీనా వాటిపై విచారణకు ఆదేశించారు. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు కూడా. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటినుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. అస్థిరతే అదనుగా... 2024 ఆగస్టులో విద్యార్థి ఆందోళనల ముసుగులో చెలరేగిన దేశవ్యాప్త అల్లర్లతో నాటి ప్రధాని హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అంతేగాక రాత్రికి రాత్రే ఆమె దేశం వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం బంగ్లాలో అల్లకల్లోలం, అస్థిరత నెలకొన్నాయి. ఎటుచూసినా హింసాకాండ పెచ్చరిల్లింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఏర్పడ్డ మధ్యంతర సర్కారు వాటికి అడ్డుకట్ట వేయడంలో పూర్తి విఫలమైంది. పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి జారి రాజకీయ శూన్యం నెలకొన్న తరుణంలో గత డిసెంబర్ 25న రహ్మాన్ ప్రవాసం వీడి సొంతగడ్డపై అడుగుపెట్టారు. బీఎన్పీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తల్లి వయోభారం, అనారోగ్యం నేపథ్యంలో పార్టీని అన్నీ తానై నడిపించారు. జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల రంగంలోకి దూకారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతతో పాటు వృద్ధులనూ ఆకట్టుకున్నారు. బీఎన్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి పెట్టి దేశంలోకి అడుగు పెట్టిన నెలన్నర లోపే ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టనున్నారు! అయితే కోరలు చాస్తున్న మత వైషమ్యాలకు అడ్డుకట్ట వేయడం, ముఖ్యంగా అరాచక శక్తులకు ముకుతాడు వేయడం, దేశాన్ని ప్రగతి వైపు నడపడం ఆయనకు కఠిన పరీక్షే కానుంది. రహ్మాన్ భార్య డాక్టర్ జుబైదా బంగ్లా నేవీ మాజీ చీఫ్ కూతురు. వారికి కూతురు జైమా జర్నాజ్ ఉన్నారు. భారత్ పట్ల సానుకూలతే! షేక్ హసీనా పూర్తిగా భారత అనుకూల నేతగా పేరుపడగా ఖలీదా జియాది మాత్రం పూర్తిగా భిన్న వైఖరి. భారత్‌తో ఆమె ఎప్పుడూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జియా కుమారునిగా రహ్మాన్ తీరు ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హసీనా పదవీచ్యుతి అనంతరం గత ఏడాదిన్నరగా బంగ్లాలో భారత వ్యతిరేకత భావజాలం పరాకాష్టకు చేరింది. దానికి యూనుస్ సర్కారుకూడా పరక్షంగా దన్నుగా నిలిచింది. వీలు దొరికినప్పుడల్లా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే గాక క్రమంగా మన దాయాది పాకిస్తాన్‌కు దగ్గరవుతూ వచ్చింది. ఇదే అదనుగా బంగ్లాలో మతోన్మాద మూకలు కొన్నాళ్లుగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దమనకాండకు దిగుతున్నాయి. ఆ క్రమంలో హిందువుల హత్యలతో బంగ్లా అట్టుడుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలో అడుగుపెట్టిన రహ్మాన్, తనది మాత్రం భారత వైఖరి అనుకూల వైఖరేనని ఆదినుంచీ స్పష్టమైన సంకేతాలిస్తూ వచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
బంగ్లా బీఎన్‌పీదే
ఢాకా: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎన్పీ 209 సీట్లు గెలుచుకుంది! కరడుగట్టిన భారత వ్యతిరేకిగా, పాక్ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దానితో జట్టుకట్టిన 10 ఇతర పారీ్టలు దాదాపుగా మట్టికరిచాయి. 2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన జమాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్ సిటిజన్ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. రెండు పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జమాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్పీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. 20 ఏళ్ల తర్వాత అధికారం ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో బీఎన్పీ చైర్మన్ తారిఖ్ రహ్మాన్ (60) తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీఎన్పీ ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికార పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ఎన్నికల విజయంపై రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫలితాలపై స్పందించిన తొలి దేశాధినేత ఆయనే కావడం విశేషం. ఇందుకు మోదీకి బీఎన్పీ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రహ్మాన్ 19 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాకు తిరిగి రావడం విశేషం. షేక్ హసీనా సర్కారును కుప్పకూల్చిన దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న కల్లోలం బీఎన్పీ విజయంతో సద్దుమణిగి రాజకీయ స్థిరత్వం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్ నమోదైంది. బంగ్లాలో ఇవి 13వ సాధారణ ఎన్నికలు. విద్యార్థుల ముసుగులో 2024 ఆగస్టులో పెచ్చరిల్లిన ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు తెరదించడం, ఆమె ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. నాటినుంచీ ఒకరకంగా బంగ్లాలో రాజకీయ శూన్యమే నెలకొంది. దేశ పాలన వ్యవహారాలను ఏడాదిన్నరకు పైగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వమే చూస్తూ వస్తోంది. అయితే దేశంలో అస్థిరతకు చెక్ పెట్టడంలో, ముఖ్యంగా హిందువులు తదితర మైనారిటీలపై దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న చెడ్డపేరు మూటగట్టుకుంది. సంస్కరణలకు ‘జై’బంగ్లాదేశ్‌లో భారీ ప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజలు జైకొట్టారు. ఇందుకోసం సాధారణ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన రెఫరెండానికి అనుకూలంగా తీరి్పచ్చారు. రెఫరెండంలో భాగంగా ప్రతిపాదించిన సంస్కరణల ప్యాకేజీకి మద్దతు పలికారు. రెఫరెండానికి అనుకూలంగా ఏకంగా 60.26 శాతం ఓట్లు పడ్డట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.81 కోట్ల మంది ‘అవును’అని ఓటేయగా 2.26 కోట్ల మంది ‘కాదు’బటన్ నొక్కినట్టు తెలిపింది. హసీనా పదవీచ్యుతి అనంతరం తాత్కాలికంగా పాలన పగ్గాలు చేపట్టిన యూనుస్ గతేడాది ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.ఏడుగురుమహిళల విజయం బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఆరుగురు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీఎన్పీ నుంచే నెగ్గారు. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. బీఎన్పీ ఈసారి మొత్తం 10 మంది మహిళలకు టికెట్లిచ్చింది. ముగ్గురు హిందువుల విజయం! బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలుపొందడం విశేషం! పైగా వారంతా బీఎన్పీ టికెట్‌పై పోటీ చేసినవారే! సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ చంద్ర రాయ్ ఢాకా–3 నియోజకవర్గం నుంచి ఏకంగా 99,163 ఓట్లు సాధించి జమాతే ఇస్లామీ అభ్యర్థి మహ్మద్ షహీనుర్ ఇస్లాంపై విజయఢంకా మోగించారు. బీఎన్పీ ఉపాధ్యక్షుడు నితాయ్ రాయ్ చౌధురి మగురా–2 నుంచి, దీపేన్ దివాన్ రంగమతి నుంచి గెలుపొందారు. జమాతే తరఫున ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి చవిచూశారు.దశాబ్దాల అనంతరంమహిళా సారథులు లేకుండా బంగ్లాలో దశాబ్దాల విరామం తర్వాత ప్రధాన పారీ్టలకు మహిళా సారథులు లేకుండా జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. గత 30 ఏళ్లకు పైగా షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, బేగం ఖలీదా జియా సారథ్యంలోని బీఎన్పీ ప్రధాన పారీ్టలుగా తలపడుతూ వస్తున్నాయి. జియా అనారోగ్యంతో గత డిసెంబర్లో కన్నుమూయడం తెలిసిందే. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ హవా
ఢాకా: పదవీచ్యుత బంగ్లాదేశ్ మహిళా ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఆ దేశంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా వైరి పార్టీ ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) హవా కొనసాగుతోంది. 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో 299 స్థానాలకుగాను గురువారం పోలింగ్ జరిగింది. సాయంత్రానికి పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు ఆరంభించారు. ఇందులో కడపటి వార్తలు అందేసరికి 175కు పైగా స్థానాల్లో బీఎన్పీ పార్టీ ముందంజలో ఉంది. 67 ఏళ్ల షఫీకుర్ రెహమాన్ సారథ్యంలోని జామాతే ఇస్లామీ కూటమి కేవలం 30 స్థానాల్లో ముందంజలో ఉంది. 15 ఏళ్ల తర్వాత తమ పార్టీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని బీఎన్పీ పార్టీ చైర్మన్ తారిఖ్ వ్యాఖ్యానించారు. నెలల తరబడి మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులపై దాడులు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న దేశంలో ఇకనైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుతీరుతుందన్న ఆశతో కోట్లాది మంది బంగ్లాదేశీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మధ్యాహ్నానికి 48 శాతం పోలింగ్ స్థానిక కాలమానం ప్రకారం నాలుగున్నర గంటలకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైందని ప్రభుత్వ బీఎస్ఎస్ వార్తాసంస్థ ప్రకటించింది. అప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే ఆస్కారముంది. ఓట్ల లెక్కింపు తర్వాత తుది ఫలితాలను శుక్రవారం వెల్లడిస్తామని ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు దేశ రాజ్యాంగ సవరణ కోరుతూ 84 అంశాలతో రెఫరెండం సైతం నిర్వహించారు. ఈ రెఫరెండంకు జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. పదవీచ్యుత షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీని ఈసారి ఎన్నికల నుంచి బహిష్కరించడంతో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జామాతే ఇస్లామీ కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. జామాతే ఇస్లామీ కూటమిలో 11 పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. 2024లో ఉద్యమాన్ని లేవదీసిన విద్యార్థి సంఘాలు ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజెన్ పార్టీ(ఎన్సీపీ) సైతం జామాతే ఇస్లామీ కూటమిలో భాగస్వామిగా ఉంది. శాంతియుతంగా పోలింగ్‌లో పాల్గొన్నందుకు ఓటర్లకు తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ ఈ ఎన్నికలు, రెఫరెండం అనేవి చరిత్రాత్మకమైనవి. ఒకరకంగా కొత్త బంగ్లాదేశ్ పుట్టినరోజు ఇది’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు. మాజీ మహిళా ప్రధానమంత్రి, దివంగత ఖలీదా జియా కుమారుడు, బీఎన్పీ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ ఢాకా–17, బోగ్రా–6 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. జమాతే చీఫ్ షఫీకుర్ ఢాకాలోని నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఖుల్నాలో బీఎన్పీ అభ్యర్థి అలీ అస్ఘర్ లోబీ చేతిలో జమాతే ప్రధాన కార్యదర్శి మియా గోలం పోర్వార్ ఓటమిపాలయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఓడిపోయినా సరే ఫలితాలను అంగీకరిస్తామని బీఎన్పీ, జమాతే నేతలు వ్యాఖ్యానించడం విశేషం. 300 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా ఒక స్థానంలో అభ్యర్థి ఆకస్మిక మరణంతో మిగతా 299 నియోజకవర్గాలకే గురువారం పోలింగ్ చేపట్టారు. దేశవ్యాప్తంగా 42,779 పోలింగ్ కేంద్రాల్లో 50 లక్షల మంది తొలిసారి ఓటర్లు సహా దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు ఓటేసేందుకు తమ పేరును నమోదుచేసుకున్నారని ఎన్నికల అధికారులు గతంలోనే ప్రకటించారు. ఈసారి 50 రాజకీయ పార్టీలకు చెందిన 1,755 అభ్యర్థులతో పాటు మరో 273 మంది స్వతంత్రులు ఈసారి పోటీపడ్డారు. 15 ఏళ్లపాటు దేశాన్ని పరిపాలించిన హసీనా, అవామీ లీగ్ పార్టీ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈమె పార్టీ చిహ్నమైన పడవ తొలిసా రిగా బ్యాలెట్ పత్రాల నుంచి మాయమైంది. పలు చోట్ల ఉద్రిక్తత..పలు పోలింగ్‌కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. నాలుగు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో 9 మంది చనిపోయారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. గోపాల్‌గంజ్‌లో పోలింగ్‌కేంద్రం సమీపంలో హ్యాండ్బాంబ్ పేలిన ఘటనలో 13 ఏళ్ల బాలిక గాయపడింది. ఘర్షణలు జరిగిన చోట్ల డజన్ల మందిని అదుపులోకి తీసుకున్నారు. -
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్‌గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్‌లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్‌తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్‌ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు. -
సురక్షిత బంగ్లా
ఢాకా: ‘బంగ్లాదేశ్ ను సురక్షిత దేశంగా మార్చుకుందాం. స్వేచ్ఛాయుత, ప్రగతికాముక ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దుదాం‘ అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎంపీ) తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవాసులంతా కలసికట్టుగా ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా యువత దేశ పునరి్నర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ 17 ఏళ్ల లండన్ ప్రవాసం నుంచి గురువారం తిరిగొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా తన రాక కోసం భారీగా గుమిగూడిన మద్దతుదారులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లారు. వారినుద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పార్టీలు, మతాల విభేదాలకు అతీతంగా దేశ వికాసానికి పనిచేద్దాం. బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అందరిదీ. మత విద్వేషానికి మన దేశంలో చోటు లేదు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా హాయిగా జీవించే సురక్షిత బంగ్లాయే మన లక్ష్యం. ఇందుకోసం నా దగ్గర ప్రణాళిక ఉంది‘ అంటూ అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ నినాదాన్ని తలపించే వ్యాఖ్యలు చేశారు. దాని అమలుకు మీ అందరి మద్దతు కావాలి‘ అన్నారు. -
బంగ్లా డార్క్ ప్రిన్స్... పునరాగమనం
నానాటికీ పతనావస్థకు చేరుతున్న కల్లో ల బంగ్లాదేశ్ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యరి్థగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎనీ్ప) తాత్కాలిక చైర్మన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీఎన్పీ శ్రేణులు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికాయి. విమానాశ్రయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా పోటెత్తారు. తారిఖ్, తారిఖ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తల్లి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా అపరిమిత అధికారాలు చెలాయించిన తారిఖ్ డార్క్ ప్రిన్స్ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. తల్లి మాది రిగానే ఆయనకు కూడా భారత వ్యతిరేకిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాలో చోటుచేసుకున్న ఈ కీలక రాజకీయ పరి ణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV— Masud Rana (@MasudRana137969) December 24, 2025కాబోయే ప్రధాని! తారిఖ్ రెహా్మన్ (60). బంగ్లా అంతటా గత 17 ఏళ్లుగా ఆయన ఫోటోలు, పోస్టర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. బీఎన్పీ ర్యాలీల్లో ఆయన వీడియో సందేశాలే మాట్లాడుతూ వచ్చాయి. అవినీతి కేసులు తదితర కారణాలతో 2008 నుంచీ భార్య జుబైదా, కూతురు జైమాతో పాటు తారిఖ్ లండన్ లో తలదాచుకోవడమే ఇందుకు కారణం. గురువారం భార్య, కూతురితో కలిసి ఢాకా చేరుకున్నాక, ‘6,314 సుదీర్ఘ రోజుల అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టా. నా బంగ్లా వాసులారా! ఇకనుంచీ మీ అందరితో నేరుగానే మాట్లాడతా‘ అంటూ సోషల్ మీడియాలో తారిఖ్ పెట్టిన పోస్టు దేశమంతటా వైరల్ అయింది. ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో ఉండటంతో బీఎన్పీ పగ్గాలను తారిఖ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లాంఛనమే కానుంది. బంగ్లాలో శక్తిమంతమైన నేతగా వెలుగొందిన షేక్ హసీనా గతేడాది చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ప్రధాని పదవితో పాటు దేశాన్ని కూడా వీడి భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె అవామీ లీగ్ పార్టీపైనా ఇప్పటికే అనర్హత వేటు పడింది. ప్రభుత్వ తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కు కూడా మంచినోరే ఉన్నా ఏడాదికి పైగా అసమర్థ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. దాంతో ప్రకటించిన మేరకే వచ్చే ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగితే తారిఖ్ ప్రధాని పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమేనంటున్నారు. జమాతేకు ముకుతాడు! భారత వ్యతిరేకే అయినా, తారిఖ్ రాక మనకు ఊరటనిచ్చే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ప్రస్తుతం.నెలకొని ఉన్న తీవ్ర రాజకీయ అస్థిరతే ఇందుకు కారణం. ఏ పార్టీలోనూ పెద్దగా జనాదరణ ఉన్న నాయకుడు లేకపోవడంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలను మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ జేబు సంస్థ అయిన జమాతే ఇస్లామీ నానాటికీ కోరలు చాస్తోంది. హసీనా హయాంలో పడ్డ నిషేధాన్ని వదిలించుకుని యువత, ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. రాజకీయ శక్తిగా బలపడుతోంది. ఇటీవలి ఢాకా వర్సిటీ ఎన్నికల్లో జమాతే విద్యార్థి విభాగమే ఘనవిజయం సాధించింది. ఇతర చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపైనే జమాతే ఇప్పుడు కన్నేసింది. ఈ పరిస్థితుల్లో దానితో పోలిస్తే ఉదారవాది అయిన తారిఖ్ రాక భారత్ కు ఊరటనిచ్చే పరిణామమే. పైగా భారత్ తో సత్సంబంధాలు కోరు కుంటున్నామన్న బీఎన్పీ ప్రకటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జమాతే వంటి మతోన్మాద శక్తికి ముకుతాడు పడటం మన జాతీయ ప్రయోజనాల రీత్యా చాలా ముఖ్యమని చెబు తున్నారు. తారిఖ్ పై ఉన్న అవినీతి, హసీనా హత్యాయత్నం తదితర కేసులన్నింటినీ కోర్టులు ఇటీవలే కొట్టేశాయి. దాంతో ఆయన ఎన్నికల పోటీకి మార్గం సుగమమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెట్రోల్ బాంబ్ విసిరి.. ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు
క్రిస్మస్ పండుగ వేళ.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ హింస చెలరేగింది. బుధవారం స్థానిక మొఘ్‌బజార్ ఇంటర్సెక్షన్ వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సంగ్సాద్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన క్రూడ్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢాకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం 7:10 గంటల ప్రాంతంలో మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ నుండి బాంబును విసిరారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ఇంతకాలం ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకుడు తారిక్ రెహమాన్.. తాజాగా ఢాకాలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆయన రాక నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈలోపే ఆయన పర్యటనకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. మయమన్సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు మతవిద్వేష వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో మూకహత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు ఆందోళనలకు దారి తీయడంతో పాటు భారత్‌తో యూనస్ ప్రభుత్వానికి సంబంధాలను మరింత దెబ్బ తీసే విధంగా మార్చాయి. ఈలోపు డిసెంబర్ 22వ తేదీన మొతలేబ్ షిక్దర్ అనే మరో యువ నేతపై కాల్పులు జరిగాయి. తాజా పరిస్థితుల(ఢాకా బాంబ్ ఎటాక్) నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సత్వరం ఎన్నికలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌లోగా ఎన్నికల జరపాలనే డిమాండ్‌తో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశ నలుమూలల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు. యూనస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహా్మన్ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత సంస్కరణల అమలును వీలైనంతగా పూర్తి చేసి డిసెంబర్, జూన్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని జపాన్ పర్యటనలో ఉన్న యూనస్ పురుద్ఘాటించారు. -
చైనా,ఐఎస్ఐ హస్తం?
బంగ్లాదేశ్ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్ ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్ఐ స్లీపర్‌సెల్స్ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్ (ఐసీఎస్) కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్‌కు నిత్యం పాక్, ఐఎస్ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్ హై కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. లండన్‌లో వ్యూహరచన! హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్‌్కగా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్–బంగ్లా సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కశ్మీర్ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్‌లో ఇందుకు పక్కగా స్కెచ్ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్‌లోనే ఐసీఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్‌లకు ఐఎస్ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాక్‌లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్ రంగంలోకి దిగింది.ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!చైనా హస్తం సుస్పష్టంబంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్‌కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనవరి 7(ఆదివారం) రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బంగ్లాదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకా శివారు ప్రాంతాలు, ఘాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల విఘాతం కలిగించాలనే లక్ష్యంతో గుర్తు తెలియని దుండుగులు పొలింగ్ బూత్‌లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ ఘటనను పరిశీలించామని, పూర్తిగా అప్రమత్తతతో ఉన్నామని ఘాజీపూర్ పోలీసు ఉన్నతాధికారి ఖాజీ షఫీకుల్ ఆలం తెలిపారు. దీనికంటే ముందు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) వరుసగా మూడోసారి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి షేక్ హసీనా ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు పోలింగ్ అనే సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర ఉద్రిక్తతతలకు దారితీస్తోంది. ఇక.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చదవండి: బంగ్లా సుస్థిరత కొనసాగేనా? -
బంగ్లా సుస్థిరత కొనసాగేనా?
భారత్‌కు సన్నిహిత పొరుగుదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 నుంచి దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతున్న షేక్ హసీనా ఈసారి కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదనీ, హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందనీ ఆమె విమర్శకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టింది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాలక అవామీ లీగ్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఈ పని మరింత సులభమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న, పెద్దగా పేరులేని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పటికీ, అవి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అఖండ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, బీఎన్ పీ ఈ ఎన్నికలలో పాల్గొనక పోవడం అనేది అవామీ లీగ్ సాధించనున్న విజయంలోని ఆకర్షణను అయితే కచ్చితంగా తగ్గిస్తుంది. బేగమ్‌ల పోరు బంగ్లాదేశీయులు దేశ పితామహుడిగా భావించే షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. సైనిక నియంత జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సారథ్యం వహిస్తు న్నారు. ఈ ఇద్దరు మహిళలను బంగ్లాదేశ్‌లోని పరస్పరం పోరాడు తున్న బేగమ్‌లు (‘బ్యాట్లింగ్ బేగమ్స్’) అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో 1990లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత జరి గిన తొలి మూడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వంతులవారీగా అధికారంలో ఉన్నాయి. అయితే 2009 నుంచి దేశానికి హసీనా సారథ్యం వహిస్తున్నారు. గత దశాబ్దపున్నర కాలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శకులు ఆరోపించారు. 2014 ఎన్నికలను బహిష్కరించడం బీఎన్ పీ చేసిన తప్పిదమనీ, అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోవడానికి అది వీలు కల్పించిందనీ కొందరు అంటున్నారు. ఈ నిర్ణయం బీఎన్ పీనీ, దాని అగ్రనేతలనూ పార్లమెంటుకు చాలాకాలం పాటు దూరంగా ఉంచింది. ఖలీదా, తారిఖ్ రెహమాన్ (ఖలీదా కుమారుడు, రాజకీయ వారసుడు) సహా చాలా మంది నాయకులు అవినీతి కేసుల్లో చిక్కు కోవడంతో పార్టీ మరింత అపఖ్యాతి పాలైంది. వారి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారికి శిక్ష విధించారు. రెహమాన్ బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా లండన్‌లో ఉంటు న్నారు. ఖలీదా గృహనిర్భంధంలో ఉన్నారు; పైగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తన పార్టీ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించడం కష్టమైపోయింది. మునుపటి ఎన్నికలకు ముందు బీఎన్ పీ హింసాత్మక చర్యల్లో పాల్గొంది. ఇది బీఎన్ పీకి చెందిన మరికొందరు అగ్రనేతలను విచారించే అవకాశాన్ని కూడా అవామీ లీగ్‌కు ఇచ్చింది. ఫలితంగా పార్టీ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. అవామీ లీగ్‌ను ఏ విధంగానూ ఎదుర్కొనే స్థితిలో లేదు. ఆపద్ధర్మం స్థానంలో... బీఎన్ పీ కూటమి కీలక భాగస్వామి అయిన బంగ్లాదేశ్ జమాత్– ఎ–ఇస్లామీని ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు. పార్లమెంటరీ చట్టాలపై తమకు నమ్మకం లేదనీ, ఇస్లామిక్ చట్టం, పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నామనీ ఆ పార్టీ పదేపదే ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం జమాత్ పార్టీ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన యుద్ధ నేరాల విచారణ నేపథ్యంలో జమాతే ఇస్లామీ అగ్రనేతలకు ఉరిశిక్షలు పడ్డాయి. దాంతో పార్టీ మరింత నష్టపోయింది. సార్వత్రిక ఎన్నికలను తటస్థ మధ్యంతర ప్రభుత్వం నిర్వహించాలని బీఎన్ పీ డిమాండ్ చేస్తోంది. హసీనా ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించదని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2018 ఎన్నికలలో పాల్గొనడం ద్వారా తాము తప్పు చేశామని బీఎన్ పీ ఇప్పుడు నమ్ముతోంది. 2011లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును అవామీ లీగ్ ప్రభుత్వం తొలగించింది. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగించేది. ఏది ఏమైనప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు (2007–09) కొనసాగింది, సాధారణ ప్రభుత్వం వలె పనిచేయడమే కాకుండా దాని అధికార పరిధికి మించిన అనేక చర్యలు కూడా తీసుకుంది. అలాగే హసీనా, ఖలీదాలను కూడా విచారించింది. స్పష్టంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేయలేని వ్యవస్థ అయితే కాదు. అందుకే బంగ్లాదేశ్ ఇతర ప్రజా స్వామ్య దేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగల సంస్థలతో ముందుకు రావాలి. నిశ్శబ్ద విజయాలు ఉన్నప్పటికీ... షేక్ హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందని ఆమె విమర్శకులు ఆరోపిస్తుండగా, ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టిందన్నది మరో నిజం. ఇది బంగ్లాదేశ్‌కూ, దాని ప్రజలకూ ప్రయోజనకరంగా నిరూపితమైంది. దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తోంది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో బంగ్లాదేశ్ ఒకటి. గత దశాబ్దంలో దాని తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గత 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా హసీనా ప్రభుత్వం అమలు చేసింది. దేశ సొంత ఆర్థిక వనరులు, రుణాలు, అభివృద్ధి సహాయాల కలయికతో, కీలకమైన 2.9 బిలియన్ డాలర్ల పద్మ వంతెనను గంగానదిపై నిర్మించారు. ఈ వంతెన ఒక్కటే దేశ జీడీపీని 1.23 శాతం పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ విజయాలు ఉన్నప్పటికీ, కోవిడ్ –19 మహమ్మారి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నవంబరులో ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకోవడంతో పెరుగుతున్న జీవన వ్యయంతో దేశం పోరాడుతోంది. విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2021లో రికార్డు స్థాయిలో 48 బిలియన్ల డాలర్ల నుండి ఇప్పుడు దాదాపు 20 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదనంగా, దాని విదేశీ రుణం 2016 నుండి రెట్టింపు అయింది. అయితే, భారతదేశం అవసరమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు సహాయం చేసింది. దశాబ్దపున్నర కాలంగా బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సుస్థిరత ఆర్థికాభివృద్ధికి కారణమైందనడంలో సందేహం లేదు. భారతదేశం, బంగ్లాదేశ్ ఇప్పుడు మరింతగా ఎక్కువ స్థాయి విశ్వాసాన్ని కలిగివున్న భాగస్వామ్య పక్షాలు. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైలు కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం ఏర్పడింది. అయితే, చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య కూటమి, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో బంగ్లాదేశ్ ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో పొరుగుదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై భారత్‌ను జాగ్రత్తగా నడుచుకునేలా చేసింది. భారతదేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు తనకు అనుకూలంగా పని చేస్తాయని ఆశిస్తోంది. ఆనంద్ కుమార్ వ్యాసకర్త అసోసియేట్ ఫెలో, మనోహర్ పారీకర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసెస్, న్యూఢిల్లీ -
రేపటి బంగ్లా ఎన్నికలపై భారత దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికలు ఆ దేశానికే కాకుండా భారత దేశానికి కూడా ముఖ్యమైనవే. 1971లో విమోచన యుద్ధం ద్వారా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు సహజమైన మిత్ర దేశంగా ఉంటున్న భారత్‌కు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి, సుస్థిరత రాజకీయ రంగంలో సాధించకపోవడం మాత్రం విచారకరమైన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉండింది. గడిచిన దశాబ్దం నుంచి ఆ దేశం ఏటా ఆరు శాతానికిపైనే జీడీపీ వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది. 2017–18 సంవత్సరంలో ఏకంగా 7.86 శాతం వృద్ధి రేటును సాధించింది. బంగ్లా వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. చైనా తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెనకబడిన దేశంగా బంగ్లాదేశ్‌ను పేర్కొన్న ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ తనకు అవసరమైన సరుకులను ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్న విదేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనే భారత్‌కు బంగ్లా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రజాస్వామ్యం అంతంత మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకే దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేసి సైన్యం అధికారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు సైనిక నియంత పాలనే కొనసాగింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. గత పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఇస్లాం పార్టీ) బహిష్కరించడంతో పాలకపక్ష అవామీ లీగ్ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సగానికి పైగా పార్లమెంట్ సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 38 శాతం పోలింగ్ నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి 22 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు స్వతంత్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ దేశానికి స్వాతంత్య్ర లభించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటోంది. వాటిలో ప్రధానమైనది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అవామీ లీగ్. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన ఈ పార్టీకే మైనారీటీలైన హిందువులు, మెజారిటీలయిన బౌద్ధులు ఓటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వస్తున్నది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇస్లాం సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ పార్టీ గత ఎన్నికలను బహిష్కరించడం వల్ల వరుసగా పదేళ్లపాటు షేక్ హసీనా నాయకత్వాన ఆవామీ లీగ్ పార్టీయే అధికారంలో ఉంది. ఈ కారణంగా కూడా ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి ఆమె అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, అవినీతిపై యుద్ధం పేరిట ఆమె తన రాజకీయ ప్రత్యర్థులందరిని దాదాపుగా మట్టుబెట్టారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలేదా జియాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించారు. ఆ కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. తన ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశంలో మంచి గుర్తింపున్న మీడియా ఫొటోగ్రాఫర్ షాహిదుల్ ఆలంను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. భారత్ మద్దతు ఎవరికి ? బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆది నుంచి అవామీ లీగ్‌కే భారత్ లోపాయికారిగా మద్దతిస్తుండగా 2014 ఎన్నికల నుంచి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించింది. ఈ కారణంగానే షేక్ హసీనాతో భారత మైత్రి బలపడుతూ వచ్చింది. ఫలితంగా 2015లో ఇరు దేశాల మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి భూ సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం కాగా, మరోటి అక్కడి భూభాగం మీది నుంచి పనిచేస్తున్న ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ లాంటి భారత ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్ సంస్థలను సమూలంగా నిర్మూలించడం. ఈ రెండో ఒప్పందం కారణంగానే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ సైనికులు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు బంగ్లా సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి అస్సాం మిలిటెంట్ నాయకులను కాల్చి వేశారు. ఈసారి కూడా అవామీ లీగ్‌కే భారత ప్రభుత్వం మద్దతిస్తోంది. ఇంతకీ ఎవరిదీ గెలుపు? షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని ‘జాతీయ ఐక్య సంఘటన’ పేరిట పోటీకి రంగంలోకి దిగింది. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తోందని జాతీయ ఐక్య సంఘటన భావిస్తోంది. ఈసారి ఇరు పక్షాల మధ్య పోటీ బలంగా ఉంటుందని, ఏ పక్షమైనా గెలవచ్చని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే అవకాశం లేనందున అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా భావిస్తోంది. ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలయ్యాయని ప్రతిపక్ష అభ్యర్థులను అన్యాయంగా అభియోగాలు మోపి అరెస్ట్ చేయిస్తున్నారని ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్ట్‌కారణంగా 17 పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా పోయారు. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు గానీ వీడియోలుగానీ తీయరాదంటూ మీడియాపై ఆంక్షలు విధించినందున రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు. అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది.


