బంగ్లాదేశ్‌: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్‌ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు | Bangladesh Election: Polling Booths School Set Ablaze As Violence | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్‌ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు

Published Sat, Jan 6 2024 3:51 PM | Last Updated on Sat, Jan 6 2024 4:10 PM

Bangladesh Election: Polling Booths School Set Ablaze As Violence - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో జనవరి 7(ఆదివారం) రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బంగ్లాదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్‌ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

దేశ రాజధాని ఢాకా శివారు ప్రాంతాలు, ఘాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల విఘాతం కలిగించాలనే లక్ష్యంతో గుర్తు తెలియని దుండుగులు పొలింగ్‌ బూత్‌లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ ఘటనను  పరిశీలించామని, పూర్తిగా అప్రమత్తతతో ఉన్నామని ఘాజీపూర్‌ పోలీసు ఉన్నతాధికారి ఖాజీ షఫీకుల్ ఆలం  తెలిపారు.

దీనికంటే ముందు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. 

అయితే మరోవైపు దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (BNP) వరుసగా మూడోసారి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు పోలింగ్‌ అనే సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర ఉద్రిక్తతతలకు దారితీస్తోంది. ఇక.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

చదవండి: బంగ్లా సుస్థిరత కొనసాగేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement