బంగ్లాదేశ్‌ నోబెల్‌ గ్రహీతకు 6 నెలల జైలు | Bangladesh court sentences Nobel laureate Muhammad Yunus to 6 months in jail | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ నోబెల్‌ గ్రహీతకు 6 నెలల జైలు

Jan 2 2024 5:35 AM | Updated on Jan 2 2024 9:53 AM

Bangladesh court sentences Nobel laureate Muhammad Yunus to 6 months in jail - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్‌ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్‌ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు.

అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్‌ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement