యూనస్‌ బంగ్లాదేశ్‌ను అమ్మేస్తున్నారు  | Militant leader Yunus selling off Bangladesh to US says Sheikh Hasina | Sakshi
Sakshi News home page

యూనస్‌ బంగ్లాదేశ్‌ను అమ్మేస్తున్నారు 

May 26 2025 6:30 AM | Updated on May 26 2025 6:30 AM

Militant leader Yunus selling off Bangladesh to US says Sheikh Hasina

షేక్‌ హసీనా ఆరోపణ 

ఢాకా: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్‌ యూనస్‌ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్‌ మారి్టన్స్‌ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించడానికి నిరాకరించినందుకు తన తండ్రి షేక్‌ ముజీబుర్‌ రెహమాన్‌ను హత్య చేశారని గుర్తు చేశారు. ‘‘అమెరికా సెయింట్‌ మారి్టన్స్‌ ద్వీపం కావాలని అడిగినప్పుడు నా తండ్రి అంగీకరించలేదు. అందుకు ఆయన తన ప్రాణాలను అరి్పంచాల్సి వచి్చంది. నేనూ దాన్ని కొనసాగిస్తున్నా. అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలనే ఆలోచన నాకూ ఎప్పుడూ రాలేదు’’అని హసీనా పేర్కొన్నారు. 

డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునివ్వడంతో.. యూనస్‌ రాజీనామా చేస్తారనే వార్తలొచి్చన విషయం తెలిసిందే. అయితే.. అందుకు వ్యతిరేకంగా, యూనస్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో... హసీనా ఫేస్‌బుక్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. యూనస్‌ ఉగ్రవాద గ్రూపుల మద్దతుతో పాలన సాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘ఒకే ఒక ఉగ్రవాద దాడి తర్వాత మేం కఠినమైన చర్యలు తీసుకున్నాం. చాలా మందిని అరెస్టు చేశాం. కానీ ఇప్పుడు జైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఉగ్రవాదులందరినీ విడుదల చేశారు. అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాదుల సాయంతో యూనస్‌ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నది ఉగ్రవాదుల పాలన’అని ఆమె అన్నారు. అవామీ లీగ్‌ నిషేధాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement