రికార్డు సృష్టించిన విద్యార్థి .. ఏకంగా రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌ | bihar shreya kaushik wins rs 3 crore lincoln scholarship | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన విద్యార్థి .. ఏకంగా రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌

Jul 17 2026 8:26 AM | Updated on Jul 17 2026 9:13 AM

 bihar shreya kaushik wins rs 3 crore lincoln scholarship

పాట్నా: బీహార్‌కు చెందిన శ్రేయా కౌశిక్ అనే 18 ఏళ్ల విద్యార్థి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన రూ. 3 కోట్ల విలువైన "లింకన్ స్కాలర్‌షిప్"కు అర్హత సాధించారు. అమెరికాకు చెందిన ఈ పూర్తి ఉచిత విద్యా కార్యక్రమానికి ఈ ఏడాది ఎంపికైన ఏకైక భారతీయురాలిగా నిలిచారు.ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ సాధించడం ద్వారా  అంతర్జాతీయ విద్యా రంగంలో భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు.


లింకన్ స్కాలర్‌షిప్ అంటే ?
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం ఈ అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మందికి మాత్రమే దీనిని అందజేస్తారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. అసాధారణ విద్యా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు,సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రస్తుతం సివాన్, బీహార్‌కు చెందిన భారతీయ విద్యార్థిని శ్రేయా కౌశిక్ (18 సంవత్సరాలు) ఈ స్కాలర్‌ షిప్‌కు ఎంపికయ్యారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా రూ. 3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్ అమెరికాలో నాలుగేళ్ల విద్యకు అయ్యే పూర్తి ఖర్చులను భరిస్తుంది. పూర్తి ట్యూషన్ ఫీజు , వసతి, భోజన ఖర్చులు, పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ ఇతర ఆమోదించబడిన వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం సెంటర్ కాలేజ్ , కెంటుకీ, అమెరికా విద్యాసంస్థలో  నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్  కోర్సు ఆమె చదవబోతున్నారు.

శ్రేయా కౌశిక్ విద్యా ప్రస్థానం
బీహార్‌లోని సివాన్‌లో జన్మించిన శ్రేయ, ఆ తర్వాత ఢిల్లీలోని 'సర్వోదయ కన్యా విద్యాలయ' (అయా నగర్) లో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో విద్యార్థులకు నాయకత్వ శిక్షణ, విద్యా అవకాశాలు కల్పించే 'డెక్స్టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో చేరారు. ఈ సంస్థ ద్వారా ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో, లీడర్‌షిప్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.  ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ సాధించడంలో ఈ అనుభవం కీలక పాత్ర పోషించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement