జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం | Ukrainian Presidents key decision | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం

Jul 17 2026 7:44 AM | Updated on Jul 17 2026 8:58 AM

Ukrainian Presidents key decision

టెల్ అవీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన రక్షణశాఖ మంత్రి ఫెదోరోవ్‌ ను ఆపదవి నుంచి తప్పించారు. రక్షణమంత్రితో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జెలెన్‌ స్కీ నిర్ణయంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. కాగా ఫెదోరవ్‌ రష్యాపై దాడుల సమయంసలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ, ఫెదోరోవ్ మధ్య వ్యూహాత్మక విభేదాలు వచ్చాయి. తాను ప్రతిపాదించిన సైనిక సంస్కరణలను సిర్స్కీ కావాలనే అడ్డుకున్నారని తనతో చర్చించడానికి సైతం నిరాకరించారని ఫెదోరోవ్ స్వయంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలగింపు జరిగింది.

కాగా ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కీవ్, ఖార్కివ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి విజయాలు సాధించిన ఫెడోరోవ్‌ను తొలగించడం సరికాదని, ఆయనపై రాజకీయ కక్షలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

ఫెదోరవ్‌ ఈ ఆరునెలల కాలంలో సాధించిన విజయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్యా సైన్యానికి స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందకుండా పూర్తిగా నిలిపివేయడం, డ్రోన్ల సహాయంతో రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంలోని రవాణా వ్యవస్థను దెబ్బతీయడం,  రష్యా ఇంధన క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయడం విజయాలుగా అభివర్ణించారు.

నాటో ప్రమాణాలకు అనుగుణంగా రక్షణ శాఖను పూర్తిగా మార్చలేకపోవడం, సైనిక కొనుగోళ్లలో అవినీతి పాత పద్ధతులను పూర్తిగా నిర్మూలించలేకపోవడం వైఫల్యాలుగా చెప్పుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement