‘నారీశక్తి వందన్‌’.. మోదీకి వందనం | - | Sakshi
Sakshi News home page

‘నారీశక్తి వందన్‌’.. మోదీకి వందనం

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

చందానగర్‌: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గురువారం చందానగర్‌లో నారీశక్తి వందన్‌ పాదయాత్రను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌ యాదవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఓట్ల కోసం మాత్రమే కొన్ని పార్టీలు వాడుకున్నాయని, అమలు చేయడానికి ధైర్యం చూపిన ఏకై క నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. అనంతరం చందానగర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా వరకు పాదయాత్రలో ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్‌ కుమార్‌ సేనాపతి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement