TS Election 2023: దోస్త్‌ వర్సెస్‌ దోస్త్‌..! | - | Sakshi
Sakshi News home page

TS Election 2023: దోస్త్‌ వర్సెస్‌ దోస్త్‌..!

Nov 3 2023 7:20 AM | Updated on Nov 3 2023 8:17 AM

- - Sakshi

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఇద్దరు పాత మిత్రులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, లంకల దీపక్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు పాత మిత్రులు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. టీడీపీలో ఇరువురు సుదీర్ఘకాలం పని చేశారు. గ్రేటర్‌లో పలు పదవులు చేపట్టారు. టీడీపీలో పనిచేసిన వీరిరువురు ఇప్పుడు ఒకరు బీఆర్‌ఎస్‌, మరొకరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. వారే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, లంకల దీపక్‌రెడ్డి. టీడీపీలో మూడు దశాబ్దాలకు పైగా గ్రేటర్‌లో పనిచేసిన మాగంటి గోపీనాథ్‌ 2014లో టీడీపీ తరఫున గెలిచి తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రెండు దశాబ్దాలుగా టీడీపీలో గ్రేటర్‌తో పాటు రాష్ట్ర పదవులు చేపట్టిన లంకల దీపక్‌రెడ్డి తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. రాజకీయ అనుభవం కలిగిన లంకలకు బీజేపీ పార్టీ టికెట్‌ను ఖరారు చేసింది. ఇద్దరూ టీడీపీలో కలిసి గ్రేటర్‌లో పనిచేశారు. ఇద్దరు పాత మిత్రులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లంకల తన అనుభవాన్ని జోడించి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తారా.. లేదంటే మాగంటి హ్యాట్రిక్‌ కొడతారా? అనేది ఓటర్లే నిర్ణయిస్తారు. – శ్రీనగర్‌కాలనీ

Advertisement
 
Advertisement
Advertisement