నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు | - | Sakshi
Sakshi News home page

నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు

Aug 29 2023 2:58 AM | Updated on Aug 29 2023 7:12 AM

- - Sakshi

హైదరాబాద్: మోకిల హెచ్‌ఎండీఏ వెంచర్‌ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్‌లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్‌లో ఫేజ్‌–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్‌–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్‌.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్‌సెట్‌ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ కోకాపేట్‌ నియో పోలీస్‌ లేఅవుట్‌ దగ్గరలో ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement