21వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Sakshi News home page

Hyderabad: 21వ అంతస్తు నుంచి దూకి పని మనిషి ఆత్మహత్య

Aug 13 2023 6:04 AM | Updated on Aug 13 2023 7:11 AM

- - Sakshi

ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ చంద్రశేఖర్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ జగ్గంపేటకు చెందిన పోలపల్లి కృష్ణ జీవనోపాధి కోసం బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌కు వలస వచ్చి హౌస్‌కీపింగ్‌ పనులు చేస్తున్నాడు.

కృష్ణ కూతురు బిందుశ్రీ (28) పదేళ్లుగా మణికొండ ల్యాంకోహిల్స్‌లో– 15 ఎల్‌హెచ్‌ 2104లో నివాసం ఉంటున్న పూర్ణచంద్‌ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. హైఎండ్‌హో థియేటర్స్‌ బిజినెస్‌ చేసి కాకినాడకు చెందిన పూర్ణచంద్‌ ఇంట్లోనే సర్వెంట్‌ రూమ్‌లో బిందుశ్రీ ఉంటోంది. శనివారం తెల్లవారు జామున ఫోన్‌ మాట్లాడుకుంటూ వాష్‌ ఏరియా నుంచి బిందుశ్రీ కిందికి దూకడంతో తల ఛిద్రమై అక్కక్కడే మృతి చెందింది.

గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పూర్ణచంద్‌కు సమాచారం ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తండ్రి కృష్ణ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement