
ఆతిథ్యం ఇచ్చేవారు, పుచ్చుకునేవారు అపరిచితులే
విందులతో చిగురిస్తున్న సరికొత్త స్నేహాలు
మెట్రోలలో వేళ్లూనుకుంటున్న పార్టీ ట్రెండ్
హైదరాబాద్‌లోనూ స్ట్రేంజర్స్ మీట్, ట్రీట్ డిమాండ్
‘సప్పర్ క్లబ్స్’ పేరిట విస్తరిస్తున్న వైనం
ఓ ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, తరచూ వెళ్లే కేఫ్‌లకు బదులు, ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఎప్పుడూ కలవని మరికొందరితో కలిసి టేబుల్ పంచుకోవడం ఎలా ఉంటుంది?.. ఈ ఊహ నగరంలో వాస్తవరూపం దాలుస్తోంది.. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రెండ్‌గా మారి ఇప్పుడిప్పుడే నగరంలోనూ అంకురిస్తున్న సప్పర్ క్లబ్‌లు రేపటి అనుభవాలను మాత్రమే కాదు కొత్త స్నేహాలను తీర్చిదిద్దే వేదికలుగా అవతరిస్తున్నాయి. రుచికరమైన ఆహారం ప్రశాంతమైన సంభాషణ, కొత్త రుచులను కనుగొనడం, ఒత్తిడి లేకుండా ముచ్చట్లు.. వీటన్నింటినీ అపరిచితులతో పంచుకోవడమే సప్పర్ క్లబ్స్ ప్రత్యేకత. – సాక్షి, సిటీబ్యూరో
నగరంలో విస్తరిస్తున్న కొత్త తరహా కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్లబ్స్ ప్రత్యేకమైన అనుభవం కోసం అతిథులను ఆహ్వానిస్తున్నాయి. ‘సప్పర్ క్లబ్‌లు తరచూ ఇళ్లలో నిర్వహించే సన్నిహిత భోజన అనుభవాలు. ఇక్కడ ఆహారంతోపాటు సంభాషణలు, పరిచయాలే ప్రధానం. రెస్టారెంట్‌ల మాదిరిగా స్థిరమైన మెనూ ఉండదు. వ్యక్తులు తమ కథలు చెప్పడం, కాలానుగుణ రుచులతో కొత్త వ్యక్తులను కలవడంపై మాత్రమే దృష్టి పెడతారు. తద్వారా వారు వండిన వంటకాలను కలిసి తినడం, భాగస్వామ్య టేబుల్‌పై కనెక్ట్ అవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.’ అని సప్పర్ క్లబ్స్ నిర్వహించే జైపూర్‌కు చెందిన సీమా సేథి అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌కు సోషల్ మీడియా ప్రధాన ప్రేరకంగా మారింది. ప్రతి ఒక్కరూ తాము పంచుకోగల ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకుంటుండడం సప్పర్ క్లబ్స్‌కు ఊపునిస్తోంది.
‘ఎప్పుడూ కలవని వ్యక్తులతో ఓ ఇంట్లో జరిగే విందు పార్టీలో ఉన్నట్లు ఊహించుకోండి.. సప్పర్ క్లబ్.. కేవలం విందు కాదు.. ఇది ఒక వైబ్.. ఆకర్షణ వ్యక్తిగతంగా లీనమయ్యేలా చేస్తుంది. సాధారణ విందు విహారయాత్రకు భిన్నంగా ఉంటుంది.’ అని ముంబైలో సప్పర్ క్లబ్ హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు ప్రాచి గుప్తా అంటున్నారు.
హోమ్లీగా.. జాలీగా..
‘చెఫ్ తాజాగా క్యూరేట్ చేసిన ఆహారాన్ని తినాలనుకునే డైనర్లలో ఈ ఫార్మాట్ ఆదరణ పొందుతోంది. డైనర్లు ఒకే టేబుల్ వద్ద కూర్చునే కుటుంబ–శైలి విందు కావడం కూడా ఆకర్షణను పెంచుతుంది.’ అని పుణెకు చెందిన యాంపిల్ సప్పర్ క్లబ్ వ్యవస్థాపకురాలు చెఫ్ కౌసల్య పాటిల్ అన్నారు. నేటి తరం ప్రజలు కేవలం భోజనం కంటే ఎక్కువ కోరుకుంటున్నారని హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు సలోని గుప్తా అభిప్రాయపడ్డారు. నిర్ణీత మెనూ లేకపోవడం లాంటి ప్రత్యేకతలు సప్పర్ క్లబ్‌ల వైపు ఆకర్షించే బలమైన కారకాలుగా సీమా సేథి అంగీకరిస్తున్నారు. ‘ఇది ఆ నిర్దిష్ట సాయంత్రం కోసం మాత్రమే రూపొందిన అనుభవం..వ్యక్తిగతమైనది’ అని ఆమె చెప్పారు. ‘కోవిడ్–19 టైమ్‌లో దాదాపు రెండేళ్లు ఒంటరిగా ఇంట్లోనే గడిపాము. దీంతో మానవ సంబంధాలను పెంచుకోవడంపై ఆసక్తి పెరిగింది.’ అని గురుగ్రామ్‌లో బెంగాలీ సప్పర్ క్లబ్ టూంటూనీస్ టేబుల్ వ్యవస్థాపకురాలు టూనికా గుహా అంటున్నారు.
వలస యువతతో ఊపు..
చదువుకోడానికి లేదా పని చేయడానికి వలస వచి్చన యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ ఇళ్లను కుటుంబాలను విడిచిపెట్టిన వారు.. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి సప్పర్ క్లబ్‌లు గొప్ప మార్గంగా మారాయి.. ‘ఇవి రెస్టారెంట్లు, బార్ల కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. నగరాల్లోని ప్రజలు మంచి ఆహారం తినాలని, అలాగే మంచి స్నేహానుభవాన్ని పొందాలని కోరుకుంటారు’ అని నగరంలో సప్పర్ క్లబ్‌కు శ్రీకారం చుట్టిన ప్రణవి చెప్పారు. విభిన్న సంస్కృతులలో కమ్యూనల్ డైనింగ్ ఒక సంప్రదాయం. ప్రతి సమావేశం, దానితో ఆలోచనల మార్పిడి, విభిన్న ఆచారాలు, సంస్కృతులను మనకు పరిచయచేస్తాయి.’ అని మరో క్లబ్ నిర్వాహకులు కౌశల్య పాటిల్ అన్నారు. డిజిటల్ సంబంధాలపై ఆధారపడుతున్న యుగంలో సప్పర్ క్లబ్‌లు అవసరమైన పరస్పర సాన్నిహిత్యాన్ని అందిస్తున్నాయి.
చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్

ఇలా ప్రారంభించి.. అలా లీనమై..
ఈ విందులో పాల్గొన్నప్పుడు తొలుత ప్రతి ఒక్కరూ కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభిస్తారు. ఇక్కడికి చేరుకోడానికి వారు ఎంత ట్రాఫిక్‌ను ఎదుర్కొన్నారనే విషయాలనే మాట్లాడతారు. కానీ అలా అలా నగరంలో రుచికరమైన, ఉత్తమమైన మటన్ థాలీని ఎక్కడ దొరుకుతుందనే సంభాషణ నుంచి అలా అలా చర్చలు లోతుగా మారతాయి.. ‘దీనికి ఫ్యాన్సీ రెస్టారెంట్ అంత స్థలం అవసరం లేదు. ఇది సోషల్ మీడియా బజ్‌కు సరైనది. దీని ద్వారా నగరాల్లో హోస్ట్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించవచ్చు. ‘ఆదాయాన్ని పొందడం కంటే మిన్నగా వ్యక్తిగత బ్రాండ్ కమ్యూనిటీని సప్పర్ క్లబ్‌లు నిర్మిస్తాయి’ అని సీమా సేథి అంటున్నారు.
ఇదీ చదవండి : Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్‌మెంట్..త్వరలో పెళ్లి
ప్రతి సమావేశం కంటెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగల కథగా మారుతుంది. సొంత నిబంధనల ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరింత ముఖ్యంగా, ఇది ఆహారం కోసం మాత్రమే కాకుండా పరిచయాల కోసం వచ్చే అతిథుల సర్కిల్‌ను సృష్టిస్తుంది, వర్క్‌షాప్‌లు, సహకారాలు, ప్రయాణ అనుభవాలు తదితర భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. (నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్)
కేర్ ఫుల్.. కమ్యూనిటీ చిల్..
అపరిచితులతో కాబట్టి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టేబుల్‌లో హద్దులను నిర్దేశిస్తారు. వస్తువులను సురక్షితంగా ఉంచుతారు. హాజరవుతున్నవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో? సప్పర్ క్లబ్ డిన్నర్ టేబుల్ సీటు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో? అర్థం చేసుకోవడానికి విందుకు ముందే అవసరమైన సంప్రదింపులు ఉంటాయి.