breaking news
new culture
-
జ్ఞాపకాల హ్యాపీ ఎండింగ్
సాక్షి, హైదరాబాద్: ‘పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లం.. మరి జీవితంలో సంపాదించినంత కాలం వరకు కొనుక్కున్న ఇష్టమైన వస్తువులు, దుస్తులు, దాచుకున్న బహుమతుల వంటి వాటిని మాత్రం ఎందుకు తర్వాతి తరం వారికి భారంగా మిగల్చాలి? వారు మనతో పంచుకున్న మధుర క్షణాలను జ్ఞాపకంగా మనసులో దాచుకుంటే సరిపోతుందిగా’.. ఇదీ ఇటీవల కాలంలో కొందరు వృద్ధుల ఆలోచనా ధోరణిగా కనిపిస్తోంది. ఇది వారి జీవితంలో ప్రేమను పంచే కొత్త పద్ధతిగా అవతరిస్తోంది. యూరోపియన్ దేశమైన స్వీడన్లో కొన్నేళ్ల కిందట డోస్టాడ్నింగ్ పేరిట మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తూ భాగ్యనగరం దాకా విస్తరించింది. ప్రస్తుతం నగరం లోని ఖరీదైన ప్రాంతాల నుంచి సామాన్యులు నివసించే ప్రాంతాల వరకు ఈ సంస్కృతి చేరింది. ఇదీ ఉద్దేశం వయోభారంతో కన్నుమూసేలోగా అక్కర్లేనివి దానం చేయడం, జ్ఞాపకంగా అట్టిపెట్టుకున్న వస్తువులను వారసులకు అప్పగించడం, ఆస్తి పత్రాలు, బ్యాంకు పుస్తకాల వంటి ఆర్థిక వివరాలను ఒక చోట పెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇదేమీ చావు కోసం అన్నీ సర్దుకోవడం కాదు. బతుకును భారంగా లేకుండా చేసుకోవడం. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడతాయని, జ్ఞాపకాలు మరింత పదిలపరుచుకోవచ్చని వృద్ధులు భావిస్తున్నారు. దీన్నే కొన్ని దేశాల్లో స్వీడిష్ డెత్ క్లీనింగ్ అని కూడా పిలుస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రెండ్ హైదరాబాద్ సీనియర్ సిటిజన్స్ ఫోరం–2026 సర్వే ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిలో 41% మంది ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే 2023లో ఇది 9 శాతంగా మాత్రమే ఉండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్‌లలో నివసిస్తున్న వృద్ధుల్లో ఈ స్పృహ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రక్రియను ఎలా ఆచరించాలో తెలియజేసేందుకు నగరంలో నెలకు 2, 3 వర్క్‌షాప్‌లు కూడా జరుగుతున్నాయి. ఒక్కో సెషన్‌కు నిర్వాహకులు రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. ముంబైలోనైతే రూ. 5 వేల దాకా తీసుకుంటున్నారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్, వసంత్ కుంజ్‌లో సీనియర్లు డోస్టాడ్నింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి గ్రూపులుగా కలుస్తున్నారు. స్వీడన్లో 80% మంది సీనియర్ సిటిజన్స్ ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. జపాన్‌లో షుకాట్సు పేరుతో ఇదో జీవన విధానంగా మారింది. ఇది జీవితంపై వృద్ధుల్లో నెలకొన్న నిరాశ కాదని.. బాధ్యతతో కూడిన ప్రేమ అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చేశా.. నాకిప్పుడు 68 ఏళ్లు. నా ఒక్కగానొక్క కొడుకు షికాగోలో నివసిస్తున్నాడు. 40 ఏళ్ల కెరీర్లో నేను దాచుకున్న వస్తువులు, 500 పుస్తకాలు వాడికి అర్థం కావు. అవి బరువు తప్ప కన్నీళ్లు మిగల్చవు. అందుకే వాటన్నింటినీ పంచిపెట్టా. ఒక లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చేశా. ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నా మనసు నిండుగా ఉంది. – రాఘవరావు, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్, మియాపూర్ కూతుళ్లకు గాజులు పంచిపెట్టా.. నాకు ముగ్గురు కూతుళ్లు. నేను పోయాక నా బంగారు గాజులు, పట్టుచీరల కోసం వాళ్లు గొడవపడదనుకున్నా. అందుకే అందరినీ పిలిచి వాటిని పంచేశా. కూతుళ్లకు ఒక్కో గాజు తొడుగుతూ నా పెళ్లికి తొడుక్కున్నవి, నా భర్త తొలి బోనస్‌తో కొనిచ్చినవి అంటూ వాటి వెనకున్న కథ చెప్పా. దీంతో ఆ రోజు ఇల్లంతా జ్ఞాపకాలతో నిండిపోయింది. – సుశీలమ్మ (70), సికింద్రాబాద్ -
సూపర్ సప్పర్.. నగరంలో కొత్త తరహా కల్చర్ హవా
ఓ ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, తరచూ వెళ్లే కేఫ్‌లకు బదులు, ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఎప్పుడూ కలవని మరికొందరితో కలిసి టేబుల్ పంచుకోవడం ఎలా ఉంటుంది?.. ఈ ఊహ నగరంలో వాస్తవరూపం దాలుస్తోంది.. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రెండ్‌గా మారి ఇప్పుడిప్పుడే నగరంలోనూ అంకురిస్తున్న సప్పర్ క్లబ్‌లు రేపటి అనుభవాలను మాత్రమే కాదు కొత్త స్నేహాలను తీర్చిదిద్దే వేదికలుగా అవతరిస్తున్నాయి. రుచికరమైన ఆహారం ప్రశాంతమైన సంభాషణ, కొత్త రుచులను కనుగొనడం, ఒత్తిడి లేకుండా ముచ్చట్లు.. వీటన్నింటినీ అపరిచితులతో పంచుకోవడమే సప్పర్ క్లబ్స్ ప్రత్యేకత. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో విస్తరిస్తున్న కొత్త తరహా కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్లబ్స్ ప్రత్యేకమైన అనుభవం కోసం అతిథులను ఆహ్వానిస్తున్నాయి. ‘సప్పర్ క్లబ్‌లు తరచూ ఇళ్లలో నిర్వహించే సన్నిహిత భోజన అనుభవాలు. ఇక్కడ ఆహారంతోపాటు సంభాషణలు, పరిచయాలే ప్రధానం. రెస్టారెంట్ల మాదిరిగా స్థిరమైన మెనూ ఉండదు. వ్యక్తులు తమ కథలు చెప్పడం, కాలానుగుణ రుచులతో కొత్త వ్యక్తులను కలవడంపై మాత్రమే దృష్టి పెడతారు. తద్వారా వారు వండిన వంటకాలను కలిసి తినడం, భాగస్వామ్య టేబుల్‌పై కనెక్ట్ అవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.’ అని సప్పర్ క్లబ్స్ నిర్వహించే జైపూర్‌కు చెందిన సీమా సేథి అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌కు సోషల్ మీడియా ప్రధాన ప్రేరకంగా మారింది. ప్రతి ఒక్కరూ తాము పంచుకోగల ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకుంటుండడం సప్పర్ క్లబ్స్‌కు ఊపునిస్తోంది. ‘ఎప్పుడూ కలవని వ్యక్తులతో ఓ ఇంట్లో జరిగే విందు పార్టీలో ఉన్నట్లు ఊహించుకోండి.. సప్పర్ క్లబ్.. కేవలం విందు కాదు.. ఇది ఒక వైబ్.. ఆకర్షణ వ్యక్తిగతంగా లీనమయ్యేలా చేస్తుంది. సాధారణ విందు విహారయాత్రకు భిన్నంగా ఉంటుంది.’ అని ముంబైలో సప్పర్ క్లబ్ హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు ప్రాచి గుప్తా అంటున్నారు. హోమ్లీగా.. జాలీగా.. ‘చెఫ్ తాజాగా క్యూరేట్ చేసిన ఆహారాన్ని తినాలనుకునే డైనర్లలో ఈ ఫార్మాట్ ఆదరణ పొందుతోంది. డైనర్లు ఒకే టేబుల్ వద్ద కూర్చునే కుటుంబ–శైలి విందు కావడం కూడా ఆకర్షణను పెంచుతుంది.’ అని పుణెకు చెందిన యాంపిల్ సప్పర్ క్లబ్ వ్యవస్థాపకురాలు చెఫ్ కౌసల్య పాటిల్ అన్నారు. నేటి తరం ప్రజలు కేవలం భోజనం కంటే ఎక్కువ కోరుకుంటున్నారని హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు సలోని గుప్తా అభిప్రాయపడ్డారు. నిర్ణీత మెనూ లేకపోవడం లాంటి ప్రత్యేకతలు సప్పర్ క్లబ్‌ల వైపు ఆకర్షించే బలమైన కారకాలుగా సీమా సేథి అంగీకరిస్తున్నారు. ‘ఇది ఆ నిర్దిష్ట సాయంత్రం కోసం మాత్రమే రూపొందిన అనుభవం..వ్యక్తిగతమైనది’ అని ఆమె చెప్పారు. ‘కోవిడ్–19 టైమ్‌లో దాదాపు రెండేళ్లు ఒంటరిగా ఇంట్లోనే గడిపాము. దీంతో మానవ సంబంధాలను పెంచుకోవడంపై ఆసక్తి పెరిగింది.’ అని గురుగ్రామ్‌లో బెంగాలీ సప్పర్ క్లబ్ టూంటూనీస్ టేబుల్ వ్యవస్థాపకురాలు టూనికా గుహా అంటున్నారు. వలస యువతతో ఊపు.. చదువుకోడానికి లేదా పని చేయడానికి వలస వచి్చన యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ ఇళ్లను కుటుంబాలను విడిచిపెట్టిన వారు.. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి సప్పర్ క్లబ్‌లు గొప్ప మార్గంగా మారాయి.. ‘ఇవి రెస్టారెంట్లు, బార్ల కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. నగరాల్లోని ప్రజలు మంచి ఆహారం తినాలని, అలాగే మంచి స్నేహానుభవాన్ని పొందాలని కోరుకుంటారు’ అని నగరంలో సప్పర్ క్లబ్‌కు శ్రీకారం చుట్టిన ప్రణవి చెప్పారు. విభిన్న సంస్కృతులలో కమ్యూనల్ డైనింగ్ ఒక సంప్రదాయం. ప్రతి సమావేశం, దానితో ఆలోచనల మార్పిడి, విభిన్న ఆచారాలు, సంస్కృతులను మనకు పరిచయచేస్తాయి.’ అని మరో క్లబ్ నిర్వాహకులు కౌశల్య పాటిల్ అన్నారు. డిజిటల్ సంబంధాలపై ఆధారపడుతున్న యుగంలో సప్పర్ క్లబ్‌లు అవసరమైన పరస్పర సాన్నిహిత్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ఇలా ప్రారంభించి.. అలా లీనమై.. ఈ విందులో పాల్గొన్నప్పుడు తొలుత ప్రతి ఒక్కరూ కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభిస్తారు. ఇక్కడికి చేరుకోడానికి వారు ఎంత ట్రాఫిక్‌ను ఎదుర్కొన్నారనే విషయాలనే మాట్లాడతారు. కానీ అలా అలా నగరంలో రుచికరమైన, ఉత్తమమైన మటన్ థాలీని ఎక్కడ దొరుకుతుందనే సంభాషణ నుంచి అలా అలా చర్చలు లోతుగా మారతాయి.. ‘దీనికి ఫ్యాన్సీ రెస్టారెంట్ అంత స్థలం అవసరం లేదు. ఇది సోషల్ మీడియా బజ్కు సరైనది. దీని ద్వారా నగరాల్లో హోస్ట్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించవచ్చు. ‘ఆదాయాన్ని పొందడం కంటే మిన్నగా వ్యక్తిగత బ్రాండ్ కమ్యూనిటీని సప్పర్ క్లబ్‌లు నిర్మిస్తాయి’ అని సీమా సేథి అంటున్నారు. ఇదీ చదవండి : Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిప్రతి సమావేశం కంటెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగల కథగా మారుతుంది. సొంత నిబంధనల ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరింత ముఖ్యంగా, ఇది ఆహారం కోసం మాత్రమే కాకుండా పరిచయాల కోసం వచ్చే అతిథుల సర్కిల్‌ను సృష్టిస్తుంది, వర్క్‌షాప్‌లు, సహకారాలు, ప్రయాణ అనుభవాలు తదితర భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. (నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్)కేర్ ఫుల్.. కమ్యూనిటీ చిల్.. అపరిచితులతో కాబట్టి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టేబుల్లో హద్దులను నిర్దేశిస్తారు. వస్తువులను సురక్షితంగా ఉంచుతారు. హాజరవుతున్నవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో? సప్పర్ క్లబ్ డిన్నర్ టేబుల్ సీటు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో? అర్థం చేసుకోవడానికి విందుకు ముందే అవసరమైన సంప్రదింపులు ఉంటాయి. -
నూతన సంప్రదాయానికి నాంది
అనంతపురం కల్చరల్: సాధారణంగా పెళ్లిళ్లకో, మరో శుభకార్యానికో హాజరైన వారికి చిన్నపాటి జ్ఞాపికను అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త ముచ్చుకోట నరసింహారెడ్డి, నారాయణమ్మ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. శనివారం జరిగిన తమకుమారుడు హరినాథరెడ్డి వివాహ వేడుకకు హాజరైన అతిథులకు, బంధుమిత్రులకు ‘సంపూర్ణ ఆరోగ్యానికి జీవన సూత్రాలు’ అన్న పుస్తకాన్ని అందించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే పలు రుగ్మతలకు ప్రకృతి వైద్యంతో చేసుకునే చికిత్సలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. -
నగరాల్లో కొత్త కల్చర్.. కో లివింగ్!
మంచి ఉద్యోగాలు కావాలంటే పెద్ద నగరాలకు వెళ్లాలి. అక్కడైతేనే పెద్ద జీతంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. కానీ అలాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ ఉండాలనేది పెద్ద సమస్య. ముఖ్యంగా అమ్మాయిలైతే ఒకవైపు సదుపాయాలు, మరోవైపు భద్రత రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పుడు పెద్ద నగరాల్లో కొత్తగా వస్తున్న కల్చర్... కో లివింగ్. ఈ తరహా సదుపాయాలను కొంతమంది సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్నారు. అంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే విలాసవంతమైన ఇంటిని పంచుకోవడం అన్న మాట. ప్రస్తుతం గుర్గావ్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇళ్లను వాళ్లే అద్దెకు తీసుకుని, వాటిలో మంచి ఫర్నిచర్ సిద్ధం చేసి వాటిని ఇలా మళ్లీ అద్దెకు ఇస్తారు. కావాలనుకుంటే ఒక ఇల్లు మొత్తం మనమే తీసుకోవచ్చు లేదా ఒకరిద్దరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇళ్లలో వై-ఫై, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్.. ఇలాంటి సదుపాయాలన్నీ సిద్ధంగా ఉంటాయి. కేవలం మనకు కావల్సిన దుస్తులు తీసుకుని అక్కడకు వెళ్లిపోతే సరిపోతుంది. వీటి అద్దెలు కూడా నెలకు 8వేల నుంచి 30 వేల వరకు ఉన్నాయి. మన బడ్జెట్‌ను బట్టే సదుపాయాలు కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సంస్థలు గుర్గావ్లో నాలుగు, బెంగళూరు ప్రాంతంలో రెండు ఉన్నాయి. గుర్గావ్లో అయితే మొత్తం 575 ఇళ్లను వీళ్లు ఇలా సిద్ధం చేశారు. అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఇది ఎప్పటి నుంచో ఉందని, మన దేశంలో మాత్రం ఈ మధ్య కాలంలోనే వచ్చిందని కోహో స్టేజ్ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ లక్కర్ చెప్పారు. ప్రధానంగా లోపల ఉండేవాళ్లకు సౌకర్యంగా అనిపించడంతో పాటు.. నిర్వహణ సేవలు బాగుండటం ఇందులో మరో ప్రధానాంశం. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవాళ్లతో పాటు వేరే చోట కొన్నాళ్లు చేసి పెద్ద నగరాలకు వచ్చే యువత తాము ఉండే ప్రాంతం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. తాను ఉండే చోట ఏదైనా స్విచ్ పగిలిపోయినా, వంట గ్యాస్ అయిపోయినా తాను ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని.. మొబైల్ యాప్‌లో ఆ విషయాన్ని తెలియజేస్తే కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారం అవుతోందని ఇలాంటి కో లివింగ్‌లో ఉంటున్న స్మృతి ఆనంద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు.


