ప్రేమ లోతును చూపించింది.. వైరలవుతోంది.. సిద్‌ శ్రీరామ్‌ పాట | Singer Sid sriram kanne telugu song going viral | Sakshi
Sakshi News home page

ప్రేమ లోతును చూపించింది.. వైరలవుతోంది.. సిద్‌ శ్రీరామ్‌ పాట

Jun 11 2025 5:05 PM | Updated on Jun 11 2025 5:05 PM

Singer Sid sriram kanne telugu song going viral

సిద్‌ శ్రీరామ్‌ కన్నె పాట వైరల్‌..

సాక్షి, సిటీబ్యూరో: తన స్వరంలో ఏదో మాయ ఉంటుంది, ఆ గళంలో ప్రతి నాదం మనసును మెలిపెట్టేస్తుంది. ఆ స్వర మాధూర్యం మరెవరో కాదు.. సిద్‌ శ్రీరామ్‌. ఆయన స్వర సందడిలో భాగంగా సరికొత్త గీతం ‘కన్నె’లో మాటలకందని భావాలను పలికించారు. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్‌ చేసి, పాడానని తెలిపారు. ఒక ప్రేమ గీతంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటను వార్నర్‌ మ్యూజిక్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌లో భక్తిగీతం ‘శివనార్‌’ విడుదల తనంతరం ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా అలరిస్తోంది.  

చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌

ప్రేమ లోతును చూపిస్తుంది..  
ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్‌ మ్యూజిక్‌ ఇండియాతో ఇది నా రెండో రెండో పాట. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న పాట. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ పాట గుర్తుకుతెస్తుంది. గతంలో ‘శ్రీవల్లి’ (పుష్ప : ది రైజ్‌), ‘కుంకుమాలా’ (బ్రహ్మాస్త్ర), ‘అదియే’ (కదల్‌), ‘కన్నానా కన్నే’ (విశ్వాసం) హిట్‌ సాంగ్స్‌ వరుసలో ఈ ఏడాది మరి కొన్ని రానున్నాయి. గతేడాది ప్రపంచ ప్రఖ్యాత కోచెల్లా మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారతీయ కళాకారుడిగా నిలవడం సంతోషాన్నిచ్చింది.  – సిద్‌ శ్రీరామ్‌.  

ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement