మేకల ఫారాలకు వరం రోటరీ దాణా వ్యవస్థ | Explanation of Rotary feeding system in goat farming | Sakshi
Sakshi News home page

మేకల ఫారాలకు వరం రోటరీ దాణా వ్యవస్థ

Oct 13 2026 4:40 AM | Updated on Oct 13 2026 4:40 AM

Explanation of Rotary feeding system in goat farming

ఈ తొట్టి ద్వారా పశుగ్రాసం వృథా 25–30% తగ్గుతుంది

మహిళా రైతులకు శారీరక శ్రమ 30% తగ్గుతుంది

జీవాల పెంపకంలో వాటికి మేత వేయటం, ఆలనాపాలనా చూడటం రైతులకు, ముఖ్యంగా మహిళలకు, శ్రమతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా భువనేశ్వర్‌లోని ‘ఐసీఏఆర్‌ – సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ అగ్రికల్చర్‌’ (ఐసీఏఆర్‌–సీఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్తలు ‘రోటరీ గోట్‌ ఫీడింగ్‌ సిస్టమ్‌’ (తిరిగే మేకల దాణా తొట్టి) అనే వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. పాకల్లో మేపే ( స్టాల్‌ ఫీడింగ్‌) పద్ధతిలో మేకల పెంపకం చేపట్టే రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది.   

ప్రత్యేకతలు – నిర్మాణం: ఈ పరికరాన్ని సుమారు 6 అడుగుల వ్యాసంతో వృత్తాకారంలో రూపొందించారు. దీని మధ్య భాగంలో పచ్చిగడ్డి వేయటానికి శంకువు ఆకారపు బోను, అడుగున దాణా మిశ్రమం వేసేందుకు అర్ధ వృత్తాకార తొట్టి ఉంటాయి. ఇది గుండ్రంగా తిరిగేలా ఏర్పాటు చేయటంతో పాటు చక్రాలు కూడా ఉండటంతో అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు. 
మేకల ఫారాలు నిర్వహించే రైతులకు ప్రయోజనాలు: 
→ రైతు ఒకే చోట నిలబడి దాణా వేయవచ్చు. గుండ్రంగా తిరుగుతూ ఒకేసారి 15 నుంచి 20 మేకలు సౌకర్యవంతంగా మేత మేయటానికి ఇది వీలు కల్పిస్తుంది → సాధారణ పద్ధతుల్లో మేకలు గడ్డిని కిందపడేసి తొక్కేస్తుంటాయి. ఈ తొట్టి ద్వారా పశుగ్రాసం వృథా 25 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది ∙ఈ వ్యవస్థ వల్ల దాణా వేసే సమయం 30 శాతం, కూలీల ఖర్చు 27 శాతం మేర ఆదా అవుతాయి→ పాత పద్ధతులతో పోలిస్తే మహిళా రైతులకు శారీరక శ్రమ 30 శాతం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. 
→ ఈ డిజైన్ కు ఐసీఏఆర్‌–సీఐడబ్ల్యూఏ రిజిస్టర్డ్‌ పేటెంట్‌ పొందింది. టెక్నాలజీని పరిశ్రమలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లైసెన్ ్స ఇచ్చారు. 6 అడుగుల పరిమాణం ఉండే ఈ తిరిగే మేకల దాణా తొట్టి యూనిట్‌ ధర దాదాపు రూ. 20,000 వరకు ఉంటుంది. మేకల ఫారాలు నిర్వహించే రైతులకు ఇది ఖర్చు తగ్గించి, అధిక లాభాలు అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానమని చెపొ్పచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement