
యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) భారీ విరాళాన్ని ప్రకటించారు. 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశాననివెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.
ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం 100 మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
చదవండి: గ్రాండ్‌మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
అంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్‌గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.
ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ
ప్రస్తుతం సప్లయ్ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం.