32 వేల ఏళ్ల నాటి మొక్క పుష్పించింది..! | Ancient plants back to life after 30000 frozen years | Sakshi
Sakshi News home page

32 వేల ఏళ్ల నాటి మొక్క పుష్పించింది..!

Jun 29 2025 11:21 AM | Updated on Jun 29 2025 12:40 PM

Ancient plants back to life after 30000 frozen years

మంచుయుగం నాటి పురాతన పుష్పం ముప్పయిరెండు వేల ఏళ్ల తర్వాత  పునరుత్థానం పొందింది. ఏనాడో అంతరించిపోయిన ఈ పురాపుష్పానికి రష్యన్‌ శాస్త్రవేత్తలు పునర్జీవం కల్పించారు. ‘సైలిని స్టెనోఫిలా’ అనే ఈ పువ్వు దాదాపు ముప్పయిరెండు వేల ఏళ్ల కిందట పూసేదట! 

సైబీరియా మంచు ఎడారుల్లో పరిశోధనలు జరుపుతున్న రష్యన్‌ శాస్త్రవేత్తలకు ఈ పూల మొక్కకు చెందిన విత్తనాలు ఒక ఉడుత బొరియలో దొరికాయి. వీటిని ల్యాబొరేటరీలో మొలకెత్తించడానికి వారు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తాయి. 

మొలకలు మొక్కలుగా ఎదిగి, చక్కగా పూలు పూశాయి. వేల ఏళ్ల కిందట కాలగర్భంలో కలిసిపోయిన విత్తనాలు బయటపడటం, వాటి నుంచి మొక్కలను మొలకెత్తించడం చరిత్రలో ఇదే మొదటిసారి. రష్యన్‌ శాస్త్రవేత్తలు 2012లో చేసిన ప్రయోగం సఫలం కావడంతో ‘సైలిని స్టెనోఫిలా’ పూల మొక్కలు ఇప్పుడు చాలా ఇళ్లల్లోని కుండీల్లోకి చేరాయి.  

(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..)

Advertisement
 
Advertisement
Advertisement