ఆ ఊళ్లో నెమళ్ల బెడద.. | Peacocks in Cornwall village England Are serious problem | Sakshi
Sakshi News home page

ఆ ఊళ్లో నెమళ్ల బెడద..

Jun 29 2025 11:08 AM | Updated on Jun 29 2025 12:39 PM

Peacocks in Cornwall village England Are serious problem

నెమళ్లు చూడముచ్చటైన పక్షులు. ఆకాశంలో మబ్బులు ముసురుకున్నప్పుడు నెమళ్లు పురివిప్పి చేసే నాట్యం కనువిందైన దృశ్యం. సాధారణంగా పెద్దపెద్ద ఉద్యాన వనాలలోను, అడవుల్లోను కనిపించే నెమళ్లు ఊళ్లలోకి వచ్చేస్తేనో! ఆ బెడద మామూలుగా ఉండదంటున్నారు ఇంగ్లండ్‌లోని గల్వాల్‌ గ్రామస్థులు. 

ఇంగ్లండ్‌ నైరుతి ప్రాంతంలోని కార్న్‌వాల్‌ కౌంటీలో ఉన్న గల్వాల్‌ గ్రామానికి ఇటీవల కొంతకాలంగా నెమళ్లు పెద్ద బెడదగానే మారాయి. ‘ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో ఈ నెమళ్లు– పెద్దసంఖ్యలో ఊళ్లోకి చేరుకున్నాయి. ఇవి యథేచ్ఛగా ఇళ్లలోకి చేరి, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఇళ్లన్నీ కంపు చేసేస్తున్నాయి. 

రోడ్ల మీద తాపీగా నడకలు సాగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి’ అని గల్వాల్‌ గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. ‘నెమళ్లు చూడటానికి అందంగానే ఉంటాయి గాని, అవి ఎక్కడ పడితే అక్కడ వేసే రెట్టలను భరించడం మాత్రం చాలా కష్టం’ అని గల్వాల్‌ గ్రామస్థుడు డిలాన్‌ జాస్పర్‌ వాపోయారు. 

(చదవండి: హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..)

Advertisement
 
Advertisement
Advertisement