18 ఏళ్ల అందమైన అమ్మాయితో 90 ఏళ్ల తాత పెళ్లి : వీడియో మామూలుగా లేదుగా! | 90-Year-Old Man Married To 18-Year-Old Girl: Viral Video | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల అందమైన అమ్మాయితో 90 ఏళ్ల తాత పెళ్లి : వీడియో మామూలుగా లేదుగా!

Published Sat, Jun 15 2024 12:54 PM | Last Updated on Sat, Jun 15 2024 1:03 PM

90-Year-Old Man Married To 18-Year-Old Girl: Viral Video

ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట... అయిదు రోజుల పెళ్లి ఇది ఒకప్పటి పెళ్లిళ్ల  చరిత్ర. అంతేకాదు చిలకా  గోరింకల్లా, రాధి కృష్ణుల్లా జంట భలే ముచ్చటగా ఉన్నారు అని పెద్దలు దీవించే వారు.  ఇపుడు ట్రెండ్‌ మారింది గురూ.  లేటు వయసులో ఘాటు ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూస్తున్నాం.  

తాజాగా 90 ఏళ్ల వృద్ధుడు, 18 ఏళ్ల అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. అంగరంగ  వైభవంగా వీరి  వివాహం జరిగింది. అంతేకాదు డీజేకి తగ్గట్టుగా వరుడు, వధువుతో స్టెప్పులేశాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.  

అమేజింగ్‌ బిహార్‌ అనే ఇన్‌స్టాలో  ‘పవర్‌ ఆఫ్‌ మనీ’ పేరుతో షేర్‌ అయింది. పెళ్లి అనేది వ్యక్తిగత అవసరం అభీష్టం. కానీ సోషల్‌ మీడియా మాత్రంలో నెటిజన్లు రక రకాల కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు.  ‘అరే..కాస్త విషంతీసుకుండిరా... ఈ వీడియో చూస్తూ..చూస్తూ చచ్చిపోతా’’ అనే కామెంట్‌ మాత్రం క్రేజీగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement