● మరో ఇద్దరితో కలిసి ఘాతుకం
● ఆర్థిక వివాదాలే కారణం
● ఎర్రా గణేష్ హత్య కేసును
ఛేదించిన పోలీసులు
జాతరకు వస్తుండగా..
ఈ నెల 28న ఇన్సీసుపేటలో జరిగే జాతరకు తన అత్త ఇంటికి గణేష్ వస్తాడని ముందుగా తెలుసుకున్న చంద్రశేఖర్, తేజసత్యదుర్గ మరో స్నేహితుడు పిట్టా లోకేష్ కుమార్ పథకం పన్నారు. ఆరోజు రాత్రి 7.30 గంటల సమయంలో ఆ ప్రాంతంలో కాపుకాసి, ఒంటరిగా వస్తున్న గణేష్‌పై దాడి చేసి, తమ వెంట తెచ్చుకున్న కత్తితో హత్య చేసి పారిపోయారు. దీనిపై హతుడి మామ దేవాడ సూర్యప్రకాశ్ ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ పి.శివగణేష్, ధవళేశ్వరం సీఐ టి.గణేష్ దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్టు వారు అంగీకరించడంలో నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసిన డీఎస్పీ శివప్రియ, సీఐలు శివగణేష్, టి.గణేష్‌లను, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించారు.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రౌడీ షీటర్ ఎర్రా గణేష్ అలియాస్ గంజిగాడు హత్య కేసును రెండో పట్టణ పోలీసులు చేధించారు. అతడి స్నేహితుడే మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు తరలించారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఆల్‌కట్ గార్డెన్స్‌కు చెందిన ఎర్రా గణేష్ రైల్వేస్టేషన్‌లో సమోసాల వ్యాపారం చేస్తుండేవాడు. అతడి వద్ద పాల చంద్రశేఖర్‌రెడ్డి గుమస్తాగా పనిచేసేవాడు. వీరు సమోసాలతో పాటు గుట్కాలను కూడా విక్రయించేవారు. ఈ క్రమంలో ఎర్రా గణేష్ గుట్కా కేసులో జైలుకు వెళ్లాడు. దీంతో రైల్వేస్టేషన్‌లోని సమోసాల వ్యాపారంలో పాల చంద్రశేఖర్ తన స్నేహితుడైన గంటా తేజ సత్యదుర్గను చేర్చుకున్నాడు. ఆ వ్యాపారంలో వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఎర్రా గణేష్ భార్యకు ఇచ్చేవాడు. కొంత కాలం తర్వాత ఇవ్వడం మానేశాడు. అనంతరం ఎర్రా గణేష్ జైలు నుంచి విడుడలైన తర్వాత చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఈ విషయంపై నిలదీశాడు. వ్యాపారంలో వచ్చిన సొమ్ములో వాటాను తన భార్యకు ఎందుకు ఇవ్వలేదని, వడ్డీతో సహా దాన్ని వసూలు చేస్తానని, రైల్వే స్టేషన్‌లో సమోసా వ్యాపారం ఎలా చేస్తారో అని హెచ్చరించాడు. దీంతో అతడిని చంపేయ్యాలని చంద్రశేఖర్‌రెడ్డి, తేజసత్యదుర్గ నిర్ణయించుకున్నారు.
లోకేష్ కుమార్
తేజ సత్యదుర్గ
చంద్రశేఖర్‌రెడ్డి


