దూర విద్యలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

దూర విద్యలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రీజినల్‌ స్టడీ సెంటర్‌లో బీఏ, బీకాం దూర విద్య ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఆ స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను బీఏ రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, బీకాం కంప్యూటర్స్‌, బీఎస్సీ గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌, బీఎల్‌ఎస్సీ లైబ్రరీ, ఇన్‌ఫర్‌మేషన్‌ సైన్స్‌ గ్రూపులకు సెప్టెంబర్‌ 25 వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 78329 29614 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నున్న సోదరులకు

పలువురి పరామర్శ

రాజమహేంద్రవరం రూరల్‌: తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు, నున్న కృష్ణలను శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. నున్న తిరుమలరావు సోదరుడు నున్న సురేష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కేఎస్‌ జవహర్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు మెంబర్‌ అక్కిన మునికోటేశ్వరరావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అల్లు బాబి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోడా వెంకట్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడు, పలువురు డాక్టర్లు, పలువురు పుర ప్రముఖులు నున్న సురేష్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నున్న తిరుమలరావు, నున్న కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement