తలుపులమ్మ నవరాత్రి దీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ నవరాత్రి దీక్షలు ప్రారంభం

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

లోవ దేవస్థానంలో తొలిసారి నిర్వహణ

మాలధారణ చేసిన ఈఓ, చైర్మన్‌, ఉద్యోగులు

తుని రూరల్‌: తలుపులమ్మ దేవస్థానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న అమ్మవారి నవరాత్రి దీక్షలు శనివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. డిప్యూటీ కమిషనర్‌ పి.విశ్వనాథరాజు, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలతో సహా 35 మంది ఉద్యోగులు మాలధారణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. దీక్షా నియమాలు, విధి విధానాలు, శరణ ఘోష, పూజా విధానం తదితర వాటిని వేద పండితులు, ప్రధాన అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా ఈఓ విశ్వనాథరాజు మాట్లాడుతూ భక్తులు దీక్షా కాలం పూర్తయిన తర్వాత తలుపులమ్మ అమ్మవారి ఆలయం వద్ద అర్చకుల సమక్షంలో దీక్షా విరమణ చేయాల్సి ఉందన్నారు.

బ్యాగుల చోరీ కేసులో

నిందితుడి అరెస్ట్‌

రాజమహేంద్రవరం సిటీ: రైల్వే ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి, 145 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని రాజమహేంద్రవరం జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ వైవీ రమణ అన్నారు. స్థానిక జీఆర్పీ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరిలో నమోదైన బ్యాగ్‌ చోరీ కేసులో దర్యాప్తు నిర్వహించగా నిందితుడు పట్టుబడ్డాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement