ప్రపంచమంతా సింగిల్‌ మార్కెట్‌ కాదు | World no longer single global market | Sakshi
Sakshi News home page

ప్రపంచమంతా సింగిల్‌ మార్కెట్‌ కాదు

Jun 8 2025 4:31 AM | Updated on Jun 8 2025 4:31 AM

World no longer single global market

దేశాలు, కూటములు బట్టి వ్యూహాలు ఉండాలి 

ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని 

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ గ్లోబల్‌ కంపెనీలు ఒకే మార్కెట్‌గా పరిగణించే పరిస్థితి లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని వ్యాఖ్యానించారు. రకరకాల కూటములు, దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటోందని ఆయన చెప్పారు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వల్ల అనేక రకాల ధోరణులు ఒకేసారి కనిపిస్తుండటంతో కంపెనీలు తమ ప్రాథమిక సూత్రాలను పునఃసమీక్షించుకుంటూ, సరికొత్త వ్యూహాలను రచించుకోవాల్సి వస్తోందని 2025 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికలో నీలేకని తెలిపారు. 

కోవిడ్‌ మహమ్మారి వల్ల సరఫరా వ్యవస్థపరమైన రిస్కులను తగ్గించుకుని, విశ్వసనీయమైన బ్యాకప్‌ ఆప్షన్లను అభివృద్ధి చేసుకోవాల్సి వచి్చందన్నారు. సకాలంలో డెలివరీ చేయడంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోవడం లేదని ఊహించని విధంగా తలెత్తే అంతరాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తగు వ్యూహాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. సోర్సింగ్‌పరంగా వైవిధ్యాన్ని పాటించాల్సిన అవసరాన్ని టారిఫ్‌ల వివాదం సూచిస్తోందన్నారు. ఇక కృత్రిమ మేథ వల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఎదురయ్యే రిసు్కలు కూడా అనిశి్చతికి దారితీస్తున్నాయని నీలేకని వివరించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement