breaking news
Infosys chairman
-
ప్రపంచమంతా సింగిల్ మార్కెట్ కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ గ్లోబల్ కంపెనీలు ఒకే మార్కెట్‌గా పరిగణించే పరిస్థితి లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. రకరకాల కూటములు, దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటోందని ఆయన చెప్పారు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వల్ల అనేక రకాల ధోరణులు ఒకేసారి కనిపిస్తుండటంతో కంపెనీలు తమ ప్రాథమిక సూత్రాలను పునఃసమీక్షించుకుంటూ, సరికొత్త వ్యూహాలను రచించుకోవాల్సి వస్తోందని 2025 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికలో నీలేకని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల సరఫరా వ్యవస్థపరమైన రిస్కులను తగ్గించుకుని, విశ్వసనీయమైన బ్యాకప్ ఆప్షన్లను అభివృద్ధి చేసుకోవాల్సి వచి్చందన్నారు. సకాలంలో డెలివరీ చేయడంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోవడం లేదని ఊహించని విధంగా తలెత్తే అంతరాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తగు వ్యూహాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. సోర్సింగ్పరంగా వైవిధ్యాన్ని పాటించాల్సిన అవసరాన్ని టారిఫ్‌ల వివాదం సూచిస్తోందన్నారు. ఇక కృత్రిమ మేథ వల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఎదురయ్యే రిసు్కలు కూడా అనిశి్చతికి దారితీస్తున్నాయని నీలేకని వివరించారు. -
దటీజ్ యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆ ప్రత్యేకతే వేరు.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆయనను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న కూర్చీల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా స్త్రీ మూర్తులను గౌరవించే విషయంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Pradeep K (@pradeep_avru) November 1, 2022 -
ఇన్పీ ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ
ముంబై: సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి సంక్షోభంలో పడింది. ఈ పరిణామంపై కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులు, మార్కెట్ పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాక్సీ ఇన్వెస్టర్ సలహా సంస్థ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేసింది. ఇన్ఫీలో అత్యంత ఉన్నత వ్యవస్థాపకులలో ఒకరైన నందన్ నీలేకన్‌ను బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ తీసుకోవాలని ప్రదిపాదించింది. ఈ మేరకు ఆయనను కన్విన్స్ చేయాల్సి ఉందని తన నివేదికలో పేర్కొంది. తద్వారా భారత ఐటీ పరిశ్రమకు గుండెకాయలా ఉన్న ఇన్ఫీని కాపాడుకోవడానికి కోరింది. ఇన్ఫీ విజయమే ఐటీ భవిష్యత్తుకు సూచికలాంటిదని తెలిపింది. ఇన్ఫోసిస్ బోర్డు తన సీఈవోను కాపాడుకోలేకపోయిందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఎఎస్) సంస్థ అభిప్రాయపడింది. కార్పొరేట్ పాలన నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు , నిర్వహణకు మధ్య ఇటీవల నెలకొన్నవివాదమే దీనిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నందని నీలేకని సరైన వ్యక్తిగా పేర్కొంది. టెక్నాలజీ పురోగతితో వేగంతో ఉన్న ఆయన దేశంలో డిజిటల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. అలాగే ప్రపంచ నాయకులు, ఇతర అధికారులతో కలిసి పనిచేసిన అనుభవ ఉందనీ, ఇన్ఫోసిస్ ప్రారంభంనుంచి సంస్థలో ఉన్న నందన్ నీలేకని కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడంతోపాటు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో కొంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ పరిణామాలు సమీప భవిష్యత్తులో ఇన్ఫీకి కొంత ఎదురు దెబ్బేనని ఏంజెల్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. అయితే వీటన్నింటిని సంస్థ అధిగమిస్తుందనే నమ్ముతున్నామని ఏంజిల్ బ్రోకింగ్ ఐటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సరభ్‌జిత కౌర్ నంగ్రా చెప్పారు. బోర్డు వైస్ చైర్మన్‌గా సిక్కాకు ఉద్వాసన పలికే ప్లాన్‌లో భాగమే ఈ నిర్ణయమని సింఘి అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు & ఎండీ మహేష్ సిన్ఘి అభిప్రాయపడ్డారు. కాగా మూడు దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నీలేకనీ కూడా ఒకరు. మార్చి 2002 - ఏప్రిల్ 2007 మధ్య ఆయన సంస్థకు సీఈవోగా తన సేవలందించారు. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ , భారీ వేతన ప్యాకేజీలపై రగిలిన వివాదం, తదనంతర పరిణమాలు చివరకు ఇన్ఫోసిస్ మొట్టమొదటి నాన్- ఫౌండర్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామాకు దారి తీశాయి. ఆయన ఆకస్మిక రాజీనామాతో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఎఫ్ఓ) యూబీ ప్రవీణ్‌రావు ఎంపికైన సంగతి తెలిసిందే.