విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు | Wipro promoter entities swap stake worth Rs 4675 crore | Sakshi
Sakshi News home page

విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు

Jun 15 2025 11:15 AM | Updated on Jun 15 2025 12:46 PM

Wipro promoter entities swap stake worth Rs 4675 crore

ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్‌ ప్రేమ్‌జీ ట్రస్ట్‌ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన ప్రజీమ్‌ ట్రేడర్స్, జాష్‌ ట్రేడర్స్‌ కొనుగోలు చేశాయి.

డీల్‌ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్‌ ప్రేమ్‌జీ ట్రస్ట్‌ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన ప్రజీమ్‌ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, హర్షమ్‌ ట్రేడర్స్‌ అండ్‌ ప్రజీమ్‌ ట్రేడర్స్‌ కొనుగోలు చేశాయి.

డీల్‌ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్‌లో ప్రజీమ్‌ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ద్వారా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్‌ ట్రేడర్స్‌ వీటిని విక్రయించడం గమనార్హం!

Advertisement
 
Advertisement
Advertisement