రెండేళ్ల తరువాత లాంచ్‍కు సిద్దమవుతున్న కారు ఇదే.. | Tata Curvv Unveiled Ahead Launch | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తరువాత లాంచ్‍కు సిద్దమవుతున్న కారు ఇదే..

Jul 19 2024 7:48 PM | Updated on Jul 19 2024 8:13 PM

Tata Curvv Unveiled Ahead Launch

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సుమారు రెండేళ్ల తరువాత ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ కారును ఆవిష్కరించింది. ఇది ఆగష్టు 7న భారతీయ విఫణిలో లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 2022 లో కాన్సెఫ్ట్ మోడల్‌గా కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డు మీదికి రానుంది.

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ మిడ్ సైజ్ SUV పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. ఈ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్‌ పొందుతుంది. ఫ్రంట్ ఫాసియా కొంతవరకు హారియర్, సఫారీకి మాదిరిగా ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చూడచక్కగా ఉంటుంది.

టాటా కర్వ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ బేస్డ్ హెచ్‌విఎసి కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందవచ్చని సమాచారం. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

టాటా కర్వ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నాము. ఎలక్ట్రిక్ మోడల్ 450 కిమీ రేంజ్ అందించడానికి ఉపయోగపడే బ్యాటరీ ప్యాక్ అందిస్తుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement