యుద్ధంలో యూఎస్‌ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock market updates on June 23, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: యుద్ధంలో యూఎస్‌ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jun 23 2025 9:53 AM | Updated on Jun 23 2025 11:21 AM

Stock market updates on June 23, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇటీవల ఇరాన్‌ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.99

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76.94 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.22 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.51 శాతం నష్టపోయింది.

ఇదీ చదవండి: అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలు

సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్‌ జోన్‌)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్‌ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement